Skip to main content

TG EAPCET 2025 Hall Tickets Released: టీజీ ఈఏపీసెట్‌ 2025 హాల్‌టికెట్లు విడుదల.. ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించండి!

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహిస్తున్న టీఎస్‌ ఈఏపీసెట్‌ (TG EAPCET) 2025 పరీక్షల కోసం హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుండి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
TS EAPCET 2025 hall ticket download link   tg eapcet 2025 hall tickets released download now   TS EAPCET 2025 Hall Ticket Download Announcement  TS EAPCET 2025 Hall Ticket Available on Official Website  TS EAPCET 2025 Exam Hall Ticket Download for Pharmacy Admissions

హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్ చేసే విధానం:

  • అధికారిక వెబ్‌సైట్‌: https://eapcet.tgche.ac.in/
  • హోమ్‌పేజీలో "Download Hall Ticket" లింక్‌ మీద క్లిక్ చేయండి.
  • అప్లికేషన్‌ నంబర్‌, జనన తేది, పరీక్ష స్ట్రీమ్ (Engineering/Agriculture & Pharmacy) ఎంటర్ చేయండి.
  • హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

సెట్ పరీక్ష తేదీలు, సమయం ఇలా.. 

(పరీక్ష రెండు సెషన్లుగా జరుగుతుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం
12 వరకు.. సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు)

పరీక్ష

పరీక్ష తేదీలు

హాల్‌ టిక్కెట్ల డౌన్‌లోడ్‌

అగ్రి, ఫార్మా

ఏప్రిల్‌ 29 – 30

19–4–25 (సాయంత్రం 3 నుంచి)

ఇంజనీరింగ్‌

మే 2 – 4

22–4–25 (సాయంత్రం 3 నుంచి)

హాల్‌టికెట్‌పై పొందుపర్చిన ముఖ్య సమాచారం:

  • అభ్యర్థి పేరు, ఫోటో, సిగ్నేచర్
  • పరీక్ష కేంద్రం వివరాలు
  • పరీక్ష తేదీ, సమయం
  • ముఖ్య సూచనలు

చదవండి: ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా @ ఈఏపీసెట్‌.. సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఒక్క నిమిషం ఆలస్యం కూడా అనుమతి లేదు

TG EAPCET 2025 పరీక్షలు కఠినమైన నిబంధనలతో జరుగనున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యం జరిగినా అభ్యర్థులను పరీక్షకు అనుమతించరని అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్ సహా మొత్తం 16 జోన్లలో ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) జరుగుతాయి. ఇందులో హైదరాబాద్‌లోనే నాలుగు జోన్లు ఏర్పాటు చేశారు.

హాల్ టికెట్‌పై QR కోడ్ - పరీక్ష కేంద్రాన్ని ముందే తెలుసుకోండి

విజయకుమార్ రెడ్డి, దినకుమార్ లు వెల్లడించిన వివరాల ప్రకారం, హాల్ టికెట్‌పై QR కోడ్‌ను స్కాన్ చేస్తే పరీక్ష కేంద్ర స్థలం తేలికగా గుర్తించవచ్చు.

పరీక్ష కేంద్రం లోపలికి ప్రవేశం సమయాలు:

  • ఉదయం సెషన్: ఉదయం 7.30 గంటల నుండి ప్రవేశం
  • సాయంత్రం సెషన్: మధ్యాహ్నం 1.30 గంటల నుండి ప్రవేశం
  • పరీక్ష ప్రారంభానికి 90 నిమిషాల ముందే కేంద్రం లోపలికి అనుమతిస్తారు.

పరీక్ష కేంద్రాల వివరాలు:

  • ఇంజినీరింగ్ పరీక్షకు: 124 కేంద్రాలు, దరఖాస్తులు: 2,19,420
  • అగ్రికల్చర్ & ఫార్మా పరీక్షకు: 112 కేంద్రాలు, దరఖాస్తులు: 86,101
  • రెండూ రాసే అభ్యర్థులు: 253

ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించండి:

  • పరీక్ష కేంద్రంలోకి హాల్ టికెట్, ఐడీ ప్రూఫ్, బాల్ పాయింట్ పెన్, పెన్సిల్ మాత్రమే అనుమతిస్తారు.
  • క్యాలిక్యులేటర్, మొబైల్ ఫోన్, రిస్ట్‌వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధం.
  • మెహందీ, టాటూ, ఇంకు చేతులకు వేసుకోరాదు – బయోమెట్రిక్ హాజరు కోసం అవసరం.

జోన్ వారీగా పరీక్ష కేంద్రాలు, విద్యార్థుల సంఖ్య:

జోన్ అగ్రి ఫార్మా కేంద్రాలు ఇంజినీరింగ్ కేంద్రాలు ఇంజినీరింగ్ విద్యార్థులు అగ్రి ఫార్మా విద్యార్థులు రెండు రాసే విద్యార్థులు
హైదరాబాద్-1 19 21 48,638 20,282 82
హైదరాబాద్-2 13 25 42,967 8,731 59
హైదరాబాద్-3 18 24 50,149 16,925 43
హైదరాబాద్-4 11 12 24,440 12,577 40
ఖమ్మం 6 6 1,108 532 2
కొడంగల్ 5 5 3,838 1,828 2
కూకట్‌పల్లి 5 6 8,037 3,853 2
భద్రాద్రి కొత్తగూడెం 1 2 778 284 1
తూణి 2 2 1,977 987 3
కరీంనగర్ 15 15 15,116 8,276 4
మహబూబ్‌నగర్ 2 2 1,800 1,107 0
సంగారెడ్డి 3 3 4,074 2,034 0
అదిలాబాద్ 4 1 905 543 0
నిజామాబాద్ 4 4 1,650 1,110 0
వరంగల్ 8 9 11,785 5,845 5
సిర్పూర్ 2 2 2,158 1,078 2

సంవత్సరాల వారీగా దరఖాస్తుల గణాంకాలు (2018 - 2025):

సంవత్సరం ఇంజినీరింగ్ దరఖాస్తులు అగ్రి, ఫార్మా దరఖాస్తులు
2018 1,47,912 73,078
2019 1,42,210 74,989
2020 1,43,265 78,981
2021 1,64,963 86,641
2022 2,13,228 1,15,326
2023 2,54,543 1,20,600
2025 2,19,420 86,101
Published date : 23 Apr 2025 08:53AM

Photo Stories