AP PGECET Rankers : పీజీఈసెట్‌లో జేఎన్‌టీయూఏ విద్యార్థుల సత్తా..!
Sakshi Education

అనంతపురం: ఏపీ పీజీఈసెట్ ఫలితాల్లో జేఎన్‌టీయూఏ విద్యార్థులు సత్తా చాటారు. ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు ఇటీవల నిర్వహించిన ఏపీ పీజీఈసెట్–2024 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ (ఏ) ఓటీపీఆర్‌ఐలో బీఫార్మసీ పూర్తి చేసిన 22 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో గణనీయమైన ర్యాంక్‌లు సాధించి, తమ సత్తా చాటారు. ఓటీపీఆర్‌ఐ విద్యార్థి కప్సె గణేష్ రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్‌తో మెరిశారు. అలాగే 32వ ర్యాంక్‌తో చేకూరి శ్రీనాథ్ 57వ ర్యాంక్‌తో కె.జాహ్నవి ప్రతిభ చాటారు. మొత్తం 22 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు సాధించడంపై ఓటీపీఆర్‌ఐ డైరెక్టర్ దుర్గాప్రసాద్‌తో పాటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు హర్షం వ్యక్తం చేశారు.
Career Advice from IAS: పోటీ ప్రపంచంలో నిలవాలంటే... ఇలా చేయాలి: కలెక్టర్ పమేలా ఐఏఎస్
Published date : 27 Jun 2024 09:40AM