Skip to main content

Andhra Pradesh: రైజ్‌ ప్రోగ్రాంలో ఇంగ్లిష్‌లో ఆరితేరుతున్న చిన్నారులు.. 45 రోజుల్లోనే అనర్గళంగా..

పిఠాపురం: అది కాకినాడ జిల్లా అన్నవరానికి సమీపంలోని బెండపూడి గ్రామం. ఆ చిన్న ఊరిలో జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఇటీవల వార్తల్లోకెక్కింది.
Children learning English in Rise programme

ఇక్కడ చదువుతున్న విద్యార్థులు అమెరికన్‌ యాక్సెంట్‌లో ఇంగ్లిషును అనర్గళంగా మాట్లాడడమే దానికి కారణం. చదువులో ఒకప్పుడు  తుని నియోజకవర్గ పాఠశాలలు వెనుకబడి ఉండేవి. అలాంటి పాఠశాలల విద్యార్థులు ఇప్పుడు చదువులో తమను మించిన వారు లేరని చెప్పుకునే స్థాయికి ఎదిగారు.

ఇంగ్లిషులోనూ తామెవరికీ తీసిపోమని నిరూపించుకున్నారు. గతంలో  చెప్పుకోవడానికే సిగ్గుపడేలా ఉండే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు 2019 తర్వాత ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి. విదేశీ ప్రతినిధుల ప్రశంసలు సైతం అందుకుంటున్నాయి.

చదవండి: School Holidays news: ఈ సమ్మర్‌ సెలవుల్లో.. పిల్లలు ఫోన్‌కి దూరంగా ఉండాలంటే?

ఏదేశ యాసలో  అయినా తాము ఇంగ్లిషు మాట్లాడగలమని గర్వంగా చెబుతున్నారు ఇక్కడి విద్యార్థులు. దీనంతటికీ కారణం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలే. బెండపూడి జెడ్పీ హైస్కూల్‌ ఇంగ్లిషు టీచర్‌ ప్రసాద్‌ చేసిన ప్రయోగంతో ఆ విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాదించారు.

మాతృభాష తప్ప అన్య భాషలను ఎప్పుడు వినని, మాట్లాడని భాషను వారు అనర్గళంగా మాట్లాడడం ఆ పాఠశాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది. ఈ పాఠశాల విద్యార్థుల ప్రతిభను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారిని తన కార్యాలయానికి ఆహ్వానించి అభినందించారు.  

కార్పొరేట్‌కు దీటుగా.. 

కొందరు గురుకుల పాఠశాలల విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించి వచ్చారు. ఇప్పటికే ఆంగ్ల భాషను అనర్గళంగా మాట్లాడి శభాష్‌ అనిపించుకున్న బెండపూడి విద్యార్థులను మించి ఈ జిల్లాలోని మరికొన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వివిధ దేశాల భాషలను అనర్గళంగా మాట్లాడి ఔరా! అనిపించారు.

చదవండి: Diploma Program Admissions: ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు

అంతేగాకుండా ఇటీవలల భారత్‌లో జరిగిన జీ –20 దేశాల సమావేశాన్ని ఈ విద్యార్థులు మాక్‌ జీ– 20గా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందారు. కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థులు సైతం వీరి ప్రతిభను చూసి నేర్చుకుంటున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలల ఉన్నతి కార్పొరేట్‌ విద్యాసంస్థల స్థాయిని  మించి పోయిందని ఇక్కడి విద్యార్థులు నిరూపించారు. పేదవాడికి నాణ్యమైన ఇంగ్లిషు  అందించాలనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాన్ని అనతి కాలంలోనే నిజం చేస్తున్నారు వారు. 

రైజ్‌ ప్రోగ్రాంలో శిక్షణ 

రీడ్‌ నెస్‌ ఇన్నోవేటివ్‌ ఫర్‌ సిట్యుయేషనల్‌ ఇంగ్లిషు రైజ్‌ అనే ప్రోగ్రాంతో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు భాషపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సీఎం వైస్‌ జగన్‌ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా ప్రత్యేక శ్రద్ధతో జిల్లా అంతా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిషుపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

బెండపూడి విద్యార్థులతో మమేకమైన సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు తొలుత ఎన్టీఆర్‌ జిల్లా నిడమాలూరు ప్రభుత్వ పాఠశాల్లో 12 రోజుల పాటు పైలెట్‌ ప్రాజెక్టుగా 2022 మేలో వేసవి శిక్షణ శిబిరం నిర్వహించారు. ఇక్కడ 100 మంది విద్యార్థులకు ఇంగ్లిషు భాషపై ప్రత్యేక తరగతులు నిర్వహించారు.

కేవలం 12 రోజుల్లోనే అక్కడి విద్యార్థులు ఇంగ్లిషులో మంచి ప్రావీణ్యం సాధించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకున్ని ఉన్నతాధికారులు రాష్ట్రమంతా రైజ్‌ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. దీంతో కాకినాడ జిల్లాలో వెనుకబడి ఉన్న తుని నియోజకవర్గంలో పైలెట్‌ ప్రాజెక్టుగా విద్యార్థులకు ఆంగ్లంలో ప్రత్యేక శిక్షణ ప్రారంభించారు.

అక్కడ విజయవంతం కావడంతో కాకినాడ అర్బన్, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాలకు ప్రస్తుతం విస్తరించారు. 

45 రోజుల్లోనే అనర్గళంగా.. 

ఒక్కో జెడ్పీ హైస్కూల్‌ నుంచి 30 మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేసి, వారికి ఇంగ్లిషులో ప్రత్యే శిక్షణ  ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలోనూ 45 పని వేళల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ స్వల్ప కాలంలోనే విద్యార్థులకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇంగ్లిషు మాట్లడగలిగేలా శిక్షణ ఇస్తున్నారు. 

నియోజకవర్గాల వారీగా 

తునిలో

1020 మంది

కాకినాడ అర్బన్‌లో

2800 మంది

పిఠాపురంలో

1490 మంది

జగ్గంపేటలో

1990 మంది

పెద్దాపురంలో

3745 మంది

ఇప్పటి వరకూ ఆంగ్లంలో
పట్టు సాధించిన ప్రభుత్వ
విద్యార్థులు

12,195 మంది

ఇంత బాగా నేర్చుకుంటానని అనుకోలేదు 
ఇంగ్లిషు చదవడం అంటే కష్టంగా ఉండేది. పరీక్షల్లో పాసవ్వాలనే పట్టుదలతో ఇంగ్లిషు చదివే దానిని. కాని రైజ్‌ ప్రోగ్రాం ద్వారా మా స్కూల్లో ప్రసాద్‌ మాస్టారు  తక్కువ సమయంలోనే అనర్గళంగా ఇంగ్లిషు మాట్లాడడం నేర్పించారు.  ఇంగ్లిషు మాట్లాడడం ఒక ఎత్తైతే, వేరే దేశం ఉచ్ఛారణలో మాట్లాడడం మరో ఎత్తు . ప్రస్తుతం ఇటలీ యాసలో మాట్లడడం నేర్చుకున్నాను. మాక్‌ జీ– 20 జిల్లా సదస్సులో ఇటలీ ప్రతినిధిగా ఎంపికయ్యాను. 
– గంటా లక్ష్మీప్రసన్న, టెన్త్‌ విద్యార్థిని, కేపీఎం ప్రభుత్వ స్కూల్, పిఠాపురం 

పేదల కలను జగన్‌ మామ నిజం చేశారు 
నేను పి. దొంతమూరు జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి విద్యార్థిని. మా నాన్న కిరాణా వ్యాపారి. ఇంగ్లిషు మీడియంలో చదివించాలనే ఆసక్తి ఉన్నా స్థోమత లేక ప్రభుత్వ బడిలో చేర్పించారు. ఇంగ్లిషు మీడియం స్కూల్లో చదువుకున్న వారిని చూస్తే మాకు కూడా ఇలా నేర్పితే బాగుండును అనుకునే దానిని. సీఎం వైఎస్‌ జగన్‌ మావయ్య ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు విద్యను ప్రవేశ పెట్టి అమలు చేయడంతో మాకు ఈ అవకాశం వచ్చింది. స్వల్ప కాలంలోనే ఇంగ్లిషును అనర్గళంగా మాట్లాడే స్థాయికి చేరుకున్నాం.  జీ– 20 జిల్లా సదస్సుకు ఫ్రాన్స్‌ ప్రతినిధిగా ఎంపికయ్యాను. 
– కోశెట్టి శశి నాగ, 9వ తరగతి విద్యార్థిని, పిదొంతమూరు, పిఠాపురం మండలం 

చేపలు విక్రయించే ఇంట ఇంగ్లిష్‌ చదువు 
మాది పిఠాపురం మండలం పి.దొంతమూరు. మా గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నాన్న చేపల వ్యాపారి. మా గ్రామంలోని సంపన్నుల పిల్లలు ప్రైవేట్‌ స్కూళ్లలో చదువుతూ ఇంగ్లిషులో మాట్లాడుతుంటే నేను అలా మాట్లాడగలిగితే బాగుండును అనిపించేది. అనుకోకుండా సీఎం వైఎస్‌ జగన్‌ మావయ్య ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు విద్య ప్రవేశ పెట్టి అమలు చేస్తుండడంతో నాకూ ఈ అవకాశం వచ్చింది.  తక్కువ సమయంలో ఇంగ్లిషు బాగా నేర్చుకున్నాను. నా ఇంగ్లిషు మాట తీరు చూసి మా నాన్న ఇందతా సీఎం వైఎస్‌ జగన్‌ చలువే అంటూ మురిసిపోతున్నారు. 
–సిమ్మా వీర దుర్గ,  9వ తరగతి విద్యార్థిని, పి దొంతమూరు, పిఠాపురం మండలం 

ఇది నిజంగా మిరాకిల్‌ 
మారుమూల గ్రామాల ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఇలా అమెరికన్‌ లాంగ్వేజ్‌ మాట్లాడడం నిజంగా మిరాకిల్‌. తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వీడియోలను సోషల్‌ మీడియాలో చూసి ఎంత వరకూ నిజమో తెలుసుకోవాలని ఇక్కడకు వచ్చాను. తీరా చూస్తే నమ్మలేని నిజమని రుజువైంది.        ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృషి నిజంగా అభినందనీయం. 
– వివియాన్, ఉపాధ్యాయురాలు, ఆస్ట్రేలియా 

సీఎం జగన్‌ ప్రోత్సాహమే కారణం 
తక్కువ సమయంలో విద్యార్థులు ఆయా దేశాల భాషలను అనుసరిస్తూ ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడడం ఆంగ్ల ప్రొఫెసర్లనే ఆశ్చర్యపరిచింది.  అంతర్జాతీయ అంశాలపైనా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. గ్లోబల్‌ ఇంటరాక్టివ్‌ ప్యానల్స్‌ ద్వారా డిజిటల్‌ టచ్‌ స్క్రీన్‌పై పాఠాలు బోధించే ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా వ్యవస్థలో తీసుకు వచ్చిన సంస్కరణల వల్లే సాధ్యమైంది. రైజ్‌ ప్రోగ్రాం ద్వారా ఇప్పటికే కాకినాడ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు నేర్పిస్తున్నాం. 
– జీవీ ప్రసాద్, రైజ్‌ కో–ఆర్డినేటర్, కాకినాడ జిల్లా  

Published date : 04 May 2024 10:55AM

Photo Stories