Skip to main content

AP Inter 2025 Exams Fee Date Extended: ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల తత్కాల్‌ ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు

సాక్షి, ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులు 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మర్చిలో జరగనున్న ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువు మరోమారు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన జారీ చేసింది.
Intermediate Public Examinations 2024-25 fee payment update   ap inter 2025 exam fee deadline extended till january 30   AP Inter Board exam fee deadline extended notification

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును జ‌న‌వ‌రి 30 వరకు పొడిగించినట్లు బోర్డు అధికారులు తెలిపారు. తత్కాల్‌ పథకం కింద ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించామని, జ‌న‌వ‌రి 28 నుంచి 30 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి కృతికాశుక్లా తెలిపారు.

చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2025 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్ | టిఎస్ ఇంటర్

గతంలో ఫీజు చెల్లించలేకపోయిన వారు అపరాధ రుసుముతో కలిపి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు విడివిడిగా రూ.3 వేల చొప్పున చెల్లించాలని ఆమె సూచించారు. పరీక్ష ఫీజుకు సంబంధించి భవిష్యత్తులో ఇక ఎలాంటి పొడిగింపు ఉండదని, ఇదే చివరి అవకాశమని ఆమె స్పష్టం చేశారు.

Published date : 30 Jan 2025 09:47AM

Photo Stories