AFCAT 2025 Notification: ఏఎఫ్‌క్యాట్(1)–2025 నోటిఫికేషన్ విడుదల.. ఎంపిక విధానం, ప్రిపరేషన్ తదితర వివరాలు..
బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్ అర్హతలుగా ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో పోస్ట్‌ల భర్తీకి సొంతగా నిర్వహించే ప్రక్రియే.. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఏఎఫ్‌క్యాట్). ఏటా రెండుసార్లు ఈ పరీక్షను ఎయిర్‌ఫోర్స్ నిర్వహిస్తుంది. తాజాగా ఏఎఫ్‌క్యాట్(1)–2025 ఎంపిక ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం 336 పోస్ట్‌లు
ఏఎఫ్‌క్యాట్(1)–2025 ద్వారా మొత్తం 336 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్‌టెక్నికల్ పోస్టులు ఉన్నాయి.
అర్హతలు
- ఫ్లయింగ్ బ్రాంచ్: ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు 60 శాతం మార్కులతో బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి.
- ఏరోనాటికల్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్): నిర్దేశిత బ్రాంచ్‌లతో60 శాతం మార్కులతో బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
- ఏరోనాటిక్ ఇంజనీర్ (మెకానికల్): ఏరోస్పేస్, ఏరోనాటికల్,ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్,మెకానికల్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమేషన్ తదితర విభాగాల్లో బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.
- గ్రౌండ్ డ్యూటీ–వెపన్ సిస్టమ్స్: ఎంపీసీ గ్రూప్‌లో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
- గ్రౌండ్ డ్యూటీ–అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్: 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
- గ్రౌండ్డ్యూటీ–అకౌంట్స్: 60శాతం మార్కులతో బీకాం లేదా బీబీఏ/బీబీఎం/ బీబీఎస్(ఫైనాన్స్ స్పెషలైజేషన్) లేదా సీఏ/సీఎంఏ/సీఎస్/సీఎఫ్ఏ పాసవ్వాలి.
- గ్రౌండ్ డ్యూటీ ఎడ్యుకేషన్ బ్రాంచ్: 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
- గ్రౌండ్ డ్యూటీ మెటీయరాలజీ బ్రాంచ్: 60 శాతం మార్కులతో బీఎస్సీ(ఫిజిక్స్, మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణత లేదా నిర్దేశిత బ్రాంచ్‌లతో బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.
- ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్(ఫ్లయింగ్ బ్యాచ్): ఎన్సీసీ ఎయిర్‌వింగ్ సీనియర్ డివిజన్ ‘సి’ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు అందుబాటులో ఉన్న అవకాశం ఇది. ఎన్సీసీ సర్టిఫికెట్‌తోపాటు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ తప్పనిసరి. ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో 60 శాతం మార్కులు సాధించాలి.
వయసు
ఫ్లయింగ్ బ్రాంచ్: జనవరి 1, 2026 నాటికి 20–24 ఏళ్లు ఉండాలి. ఫ్లయింగ్ బ్రాంచ్‌కు సంబంధించి కమర్షియల్ పైలట్ లైసెన్స్ కలిగి ఉన్న వారికి గరిష్ట వయో పరిమితిలో రెండేళ్ల సడలింపు ఉంటుంది.
గ్రౌండ్ డ్యూటీ: జనవరి 1, 2026 నాటికి 20–26 ఏళ్లు ఉండాలి.
అన్ని విభాగాలకు అవివాహితులు మాత్రమే అర్హులు
ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ
ఏఎఫ్‌క్యాట్‌లో భాగంగానే ఫ్లయింగ్ బ్రాంచ్‌లో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్‌లో పేర్కొన్న ఖాళీలు, అదే విధంగా ఏఎఫ్‌క్యాట్‌లో పేర్కొన్న సీట్లకు పది శాతం చొప్పున ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్‌కు కేటాయిస్తారు. ఈ విధానంలో దరఖాస్తు చేసుకోవాలంటే.. ఎన్సీసీ ఎయిర్ వింగ్ విభాగంలో ‘సి’ సర్టిఫికెట్ పొంది ఉండాలి.
రెండు దశల ఎంపిక
ఏఎఫ్‌క్యాట్ ద్వారా ఎయిర్‌ఫోర్స్‌లో ఆయా పోస్ట్‌లను భర్తీ చేసే క్రమంలో రెండు దశల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ముందుగా ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇందులో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన వారికి మలి దశలో ఎయిర్‌ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ పరిధిలో మరో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
నాలుగు విభాగాల్లో ఏఎఫ్‌క్యాట్
ఎంపిక ప్రక్రియలో తొలి దశగా నిర్వహించే ఏఎఫ్‌క్యాట్ మొత్తం 4 విభాగాల్లో (జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ వెర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్) 300 మార్కులకు ఉంటుంది. మొత్తం నాలుగు విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు కేటాయిస్తారు. అదే విధంగా తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ నిబంధన కూడా ఉంది. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో నిర్వహిస్తారు. పరీక్షకు నిర్దేశించిన సమయం రెండు గంటలు.
టెక్నికల్ బ్రాంచ్(గ్రౌండ్ డ్యూటీ)లో పేర్కొన్న పోస్ట్‌లకు ఏఎఫ్‌క్యాట్‌తోపాటు ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ నిర్వహిస్తారు.ఇందులో సంబంధిత సబ్జెక్ట్ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున కేటాయిస్తారు. పరీక్షకు కేటాయించిన సమయం 45 నిమిషాలుగా ఉంటుంది.
ఏఎఫ్ఎసీబీ టెస్టింగ్
- ఎంపిక ప్రక్రియలో తొలి దశ ఏఎఫ్‌క్యాట్, ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్‌లలో విజయం సాధించిన వారికి రెండో దశలో ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్‌ల ఆధ్వర్యంలో ఏఎఫ్‌ఎస్‌బీ టెస్టింగ్ నిర్వహిస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం మూడంచెల్లో ఉంటుంది. వివరాలు..
- స్టేజ్–1: ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్.
- స్టేజ్–2: సైకలాజికల్ టెస్ట్. ఇందులో భాగంగా అయిదు రోజులు పాటు పలు అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అదే విధంగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
- ఫ్లయింగ్ బ్రాంచ్ అభ్యర్థులకు ప్రత్యేకంగా కంప్యూటరైజ్డ్ పైలట్ సెలెక్షన్ సిస్టమ్ (సీపీఎస్‌ఎస్) విధానంలో ఇంకో పరీక్ష కూడా నిర్వహిస్తారు.
- ఎన్సీసీ ఎయిర్ వింగ్ ‘సి’ సర్టిఫికెట్ ద్వారా ఎన్సీసీ ఎంట్రీకి దరఖాస్తు చేసుకున్న వారికి ఏఎఫ్‌క్యాట్ నుంచి మినహాయింపు ఉంటుంది.
- ఏఎఫ్‌క్యాట్‌తో పాటు ఏఎఫ్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన వారిని శిక్షణకు ఎంపిక చేస్తారు.
62, 52 వారాల శిక్షణ
- తుది విజేతలుగా నిలిచిన వారికి ఎయిర్‌ఫోర్స్ అకాడమీ(హైదరాబాద్)లో శిక్షణనిస్తారు. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ–టెక్నికల్ విభాగాలకు ఎంపికైన వారికి 62 వారాలు, గ్రౌండ్ డ్యూటీ(నాన్–టెక్నికల్) బ్రాంచ్‌లకు 52 వారాల పాటు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి సంబంధిత విభాగాల్లో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా కొలువు ఖరారు అవుతుంది. ప్రారంభంలో.. రూ.56,100–రూ.1,77500 వేతన శ్రేణితో నెల వేతనం అందిస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టయిఫండ్ ఇస్తారు.
- ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికైన వారికి షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో పదేళ్ల పాటు విధులు నిర్వర్తించే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత ఆసక్తి, ప్రతిభను అనుసరించి మరో నాలుగేళ్లపాటు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. షార్ట్ సర్వీస్కమిషన్ విధానంలో మొత్తం 14 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత పర్మనెంట్ కమిషన్ హోదా పొందే అవకాశాన్ని కూడా ఎయిర్‌ఫోర్స్ కల్పిస్తోంది.
బెస్ట్ స్కోర్‌కు మార్గాలు
జనరల్ అవేర్నెస్
చరిత్ర, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీలతోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం సంతరించుకున్న అంశాలు, సంఘటనలు,సైన్స్ అండ్ టెక్నాలజీ తాజా పరిణామాలు, రక్షణ రంగంలోని పరిణామాలపై దృష్టి సారించాలి.
ఇంగ్లిష్
కాంప్రషెన్షన్, ఇంగ్లిష్ గ్రామర్, సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ ఫార్మేషన్, స్పాటింగ్ ద ఎర్రర్, యాంటానిమ్స్,సినానిమ్స్, క్లోజ్ టెస్ట్, ఇడియమ్స్, ఫ్రేజెస్, అనాలజీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లపై దృష్టి పెట్టాలి.
న్యూమరికల్ ఎబిలిటీ
టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్,రేషియోస్,సింపుల్,కాంపౌండ్ ఇంట్రస్ట్,టైమ్ అండ్ డిస్టెన్స్,నంబర్ సిరీస్,పెరిమీటర్, ఏరి యా, ప్రాబబిలిటీ అంశాలపై అవగాహన పొందాలి.
రీజనింగ్ అండ్ మిలటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్
ఇందులో రాణించడానికి వెర్బల్, నాన్–వెర్బల్ రీజనింగ్ అంశాలతోపాటు.. సీటింగ్ అరేంజ్మెంట్, రొటేటెడ్ బ్లాక్స్, హిడెన్ ఫిగర్స్, అనాలజీపై అవగాహన పొందాలి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, డిసెంబర్ 31
- ఏఎఫ్‌క్యాట్ తేదీ: 2025 ఫిబ్రవరి 22, 23 తేదీలు
- పూర్తి వివరాలకు వెబ్సైట్: https://afcat.cdac.in
Tags
- AFCAT 1 short notification 2025
- AFCAT 1 2025 Notification and Exam Date
- AFCAT 1 2025 Official Notification OUT
- AFCAT 1 2025 Notification Out For 336 Posts
- invites men and women from indian citizens
- AFCAT 2025 Notification OUT
- AFCAT 1 2025 Notification Eligibility
- Jobs
- latest jobs
- Release of afcat 1 2025 notification
- AFCAT2025
- AFCATSelectionProcess
- AFCATExamDates