Skip to main content

Express Entry Canada: కెనడా కొలువులు కష్టమే.. ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ ఇమిగ్రేషన్‌ విధానంలో భారీ మార్పులు.. ఏమిటీ ‘ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ’?

ఒట్టావా: మెరుగైన ఉద్యోగావకాశాల కోసం కెనడా వలస వెళ్లాలనుకునే భారతీయ నిపుణులకు కొత్త సవాళ్లు ఎదురు కానున్నాయి. కెనడా తన ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ ఇమిగ్రేషన్‌ విధానంలో భారీ మార్పులు ప్రకటించింది. పర్మినెంట్‌ ఇమిగ్రేషన్‌ ప్రోగ్రాంకు అభ్యర్థి అర్హతను పర్యవేక్షించే కీలకమైన కాంప్రెహెన్సివ్‌ ర్యాంకింగ్‌ సిస్టం (సీఆర్‌ఎస్‌)లో మార్పులు చేశారు. కెనడా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ప్రకటన ప్రకారం అభ్యర్థులు ఇకపై ఉద్యోగ ఆఫర్‌పై అదనపు పాయింట్లు పొందరు. ఈ మార్పులన్నీ 2025 నుంచి అమల్లోకి వస్తాయి. అప్పటికే పూల్‌లో ఉన్న ఉద్యోగార్థులతో పాటు అందులోకి కొత్తగా ప్రవేశించే అభ్యర్థులందరికీ ఇది వర్తిస్తుందని కెనడా ప్రకటించింది.
Express Entry Canada

మోసాలను తగ్గించడానికే తాజా చర్యలపై కెనడా ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్, సిటిజన్‌షిప్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ మాట్లాడారు. తమ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నిపుణులైన ప్రతిభావంతులను శాశ్వత నివాసులుగా కెనడా వచ్చేలా ప్రోత్సహిస్తూనే మోసాలను తగ్గించడమే వాటి లక్ష్యమని తెలిపారు. ‘‘వలసలు కెనడా విజయానికి మూలస్తంభంగా ఉన్నాయి. సమర్థులు, తెలివైన వారిని కెనడాకు స్వాగతించడానికి కట్టుబడి ఉన్నాం. దీనివల్ల ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఉద్యోగాలు, గృహాలతో పాటు వారి అభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహం లభిస్తుంది’’అన్నారు. 

ప్రభావం ఎవరిపై?: జాబ్‌ ఆఫర్‌పై అదనపు సీఆర్‌ఎస్‌ పాయింట్లను తొలగించడం వల్ల ప్రస్తుతం కెనడాలో తాత్కాలికంగా పనిచేస్తున్న వారిపై ప్రభావం పడుతుంది. ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ సిస్టం ద్వారా శాశ్వత నివాసాన్ని కోరుకునే వారిపైనా ఈ మార్పులు ప్రభావం చూపుతాయి. ఇప్పటికే శాశ్వత నివాసం (పీఆర్‌) కోసం దరఖాస్తు చే సుకోవడానికి ఆహ్వానించిన అభ్యర్థులను మా త్రం కొత్త నిబంధనలు ప్రభావితం చేయవు. ప్రస్తుతం ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్‌ అండ్‌ సిటిజన్‌షిప్‌ కెనడా (ఐఆర్‌సీసీ) కింద పీఆర్‌ కోసం దరఖాస్తు సమరి్పంచిన వారికీ వర్తించవు. 

చదవండి: Indian Students : అమెరికాలో భార‌తీయ‌ విద్యార్థుల సంఖ్య ఎక్కువ‌.. ఓపెన్ డోర్స్ నివేదిక ప్ర‌కారం!

ఫ్లాగ్‌పోలింగ్‌పై నిషేధం: కెనడాలోని తాత్కా లిక నివాసితులు ఇకపై దేశం వీడి మళ్లీ తిరిగి రా వడానికి కూడా ఇకపై అనుమతి ఉండదు. ఇమిగ్రేషన్‌ స్థితిని మార్చడానికి సరిహద్దు వద్ద నిర్వహించే ఫ్లాగ్‌పోలింగ్‌ను కెనడా నిషేధించింది. ఇమిగ్రేషన్‌ పత్రా ల రద్దు, సవరణకు సంబంధిత అధికారులకు అధికారమిచ్చారు. ఈ మార్పులు కూడా 2025 నుంచి అమల్లోకి వస్తాయి.  

చదవండి: Indian envoy Sanjay Verma: కెనడాలో భారతీయ విద్యార్థుల పరిస్థితి తెలిస్తే.. సంజీవ్‌కుమార్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు

ఏమిటీ ‘ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ’? 

ఇది ఫెడరల్‌ స్కిల్డ్‌ వర్కర్‌ ప్రోగ్రాం. కెనడాలోని పలు సంస్థలు స్థానికంగా సరైన అభ్యర్థి దొరక్కపోతే విదేశీ ఉద్యోగులను నియమించుకుంటారు. ఈ లేబర్‌ మార్కెట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఎంఐఏ) ఆధారంగా ఉద్యోగం పొంది శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకునే ఐటీ ఉద్యోగులకు అదనపు పాయింట్లు అందుతాయి. సీఎస్‌ఆర్‌ స్కోర్‌లో అదనంగా 50 నుంచి 200 పాయింట్లు పొందుతారు. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఈ విధానంలో అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసుకుని పూల్లోకి ప్రవేశించవచ్చు. రౌండ్లలో ఎక్కువ పాయింట్లు సాధించిన వారిని కెనడా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. దరఖాస్తు అందాక శాశ్వత నివాసం (పీఆర్‌) ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోవాలి. దాన్ని ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. కొత్త మార్పుల ప్రకారం ఇకపై ఈ అదనపు పాయింట్లుండవు. వయసు, విద్య, భాషా నైపుణ్యం, ఇతర ప్రమాణాల ఆధారంగా మాత్రమే మూల్యాంకనం చేస్తారు. అంటే అభ్యర్థుల మధ్య పోటీ పెరుగుతుంది. 

Published date : 27 Dec 2024 04:26PM

Photo Stories