Skip to main content

MIT Suspends Indian Origin Student: అమెరికాలో భారత విద్యార్థి కెరియర్‌ నాశనం.. ఆ ఫొటో కారణమా?

వాషింగ్టన్‌ : పాలస్తీనాకు మద్దతుగా రాసిన ఓ వ్యాసం అమెరికాలో భారత విద్యార్థి భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో పీహెచ్‌డీ చేస్తున్న ప్లహాద్‌ అయ్యంగార్‌పై నిషేదం విధిస్తున్నట్లు తెలిపింది.
MIT Suspends Indian Origin Student
MIT Suspends Indian Origin Student MIT Suspends Indian Origin Student Prahlad Iyengar

ప్రహ్లాద్‌ ఎంఐటీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎంఐటీ నిర్వహిస్తున్న మల్టీ డిసిప్లినరీ స్టూడెండ్‌ మ్యాగజైన్‌లో పాలస్తీనాకు మద్దతుగా ఓ వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో ‘వివాదాల్ని పరిష్కరించేందుకు యుద్ధం లేదంటే హింసకు పాల్పడాలి ’ అని అర్ధం వచ్చేలా రాసినట్లు తాము గుర్తించామని అడ్మినిస్ట్రేషన్‌ విభాగం అధికారులు తెలిపారు. ప్రహ్లాద్‌ వ్యాసం ఎంఐటీలో హింసకు, నిరసనలకు ప్రేరేపించేలా ఉందని స్టూడెంట్ లైఫ్ డీన్ డేవిడ్ వారెన్ రాండాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Govt Scholarships: ఈ పథకానికి ఎంపికైతే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 50వేలు..

రీసెర్చ్ ఫెలోషిప్‌ను రద్దు

వివాదం సృష్టించేలా వ్యాసం రాసినందుకు ప్రహ్లాద్‌పై ఎంఐటీ కఠిన చర్యలు తీసుకుంది. ఐదు సంవత్సరాల నేషనల్ సైన్స్ ఫౌండేషన్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఫెలోషిప్‌ను రద్దు చేసింది. క్యాంపస్‌లోకి అడుగు పెట్టకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థి రాసిన వ్యాసాన్ని సైతం స్టూడెండ్‌ మ్యాగజైన్‌ నుంచి తొలగించింది.


ఎంఐటీ ఫిర్యాదుతో అమెరికా ప్రభుత్వం సైతం విచారణ చేపట్టింది. భారత విద్యార్థి రాసిన వ్యాసంలో పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా అనే ఉగ్రవాద సంస్థ లోగో ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది.  

Indian Students : అమెరికాలో భారీగా త‌గ్గిన భార‌తీయ‌ విద్యార్థుల సంఖ్య‌.. తొలిసారిగా.. కార‌ణం ఇదే..?

ఆ ఫోటోలే కారణం?

కాగా, ఎంఐటీ తీసుకున్న నిర్ణయంపై ప్రహ్లాద్‌ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు కేవలం తాను అందించిన వ్యాసంలోని ఫొటోలే కారణమని చెప్పారు. ఎంఐటీ అడ్మినిస్ట్రేషన్ నన్ను 'ఉగ్రవాదానికి' మద్దతు ఇస్తున్నట్లు ఆరోపించింది. ఎందుకంటే నా వ్యాసంలో పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఫొటోలు ఉన్నాయి ’ అని అతని తరుఫు న్యాయవాది ఎరిక్‌ లీ తెలిపారు.  

గతంలోనూ సస్పెండ్‌  

ప్రహ్లాద్‌పై ఎంఐటీ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతేడాది పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శనలు చేయడంతో సస్పెండ్‌ అయ్యారు. ఆ సస్పెండ్‌పై అమెరికా క్యాంపస్‌లలో మాట్లాడే స్వేచ్ఛలేదని ఆరోపణలు గుప్పించారు. అడ్మినిస్ట్రేషన్‌ విభాగం తీసుకున్న చర్యలు ప్రతి ఒక్కరిని ఆందోళన కలిగిస్తున్నాయి. నేను రాసిన వ్యాసాన్ని మ్యాగజైన్‌ నుంచి తొలగించడం, బ్యాన్‌ విధించడం  విద్యార్థి సంఘాలు, లెక్చరర్ల హక్కుల్ని భంగం కలిగించేలా ఉన్నాయని అన్నారు.  

కాగా, ప్రహ్లాద్‌ ఎంఐటీ తీసుకున్న చర్యలు పలు అమెరికన్‌ కాలేజీల్లో విద్యార్థులు మద్దతు పలికారు. డిసెంబర్ 9న కేంబ్రిడ్జ్ సిటీ హాల్‌లో అయ్యంగార్‌కు మద్దతుగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.  
 

Published date : 11 Dec 2024 01:34PM

Photo Stories