Literature Competitions: విద్యార్థులకు సాహిత్య పోటీలు
సాక్షి ఎడ్యుకేషన్: విజయనగరం ఉత్సవాలను పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు సాహిత్యంలో పోటీలు నిర్వహించనున్నట్టు మహరాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.జనార్దననాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాహితీ వేదిక పేరుతో పద్యపఠనం, వ్యాసరచన, సాహిత్య అంశాలపై సంస్కృత కళాశాలలో ఈ నెల 26వ తేదీన ఉదయం 9 గంటల నుంచి పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిలో పోటీలు ప్రారంభమవుతాయన్నారు.
➤ SEAS-2023: పాఠశాల విద్యార్థులకు సీస్ పరీక్షలు..
● పాఠశాల జూనియర్ స్థాయి విభాగానికి 6, 7, 8 తరగతి విద్యార్థులు, సీనియర్ స్థాయి విభాగానికి 9, 10 తరగతి విద్యార్థులు, పద్యపఠన పోటీల్లో జూనియర్ స్థాయి కేటగిరీకి ఏవైనా మూడు నీతి శతక పద్యాలు భావయుక్తంగా, శ్రావ్యంగా చదవాల్సి ఉంటుంది. సీనియర్ విద్యార్థులు భాస్కర, దాశరథి, శ్రీకాళహస్తీశ్వర శతకాల నుంచి ఏవైనా మూడు పద్యాలు భావయుక్తంగా, శ్రావ్యంగా చదవాల్సి ఉంటుంది.
వ్యాసరచన పోటీలు...
పాఠశాల జూనియర్ స్థాయి విద్యార్థులకు తెలుగులో ‘మన విజయనగరం జిల్లాలో పర్యాటక ప్రదేశాలు–వాటి ప్రాశస్త్యం’, సీనియర్ విద్యార్థులకు ‘మన విజయనగరం సాహితీ వైభవం’పై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు.
➤ Distance Education: దూరవిద్య ప్రవేశాలకు దరఖాస్తుల తేదీ పొడగింపు..
● ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగులో ‘మన విజయనగరం జిల్లా చారిత్రక విశిష్టత’, డిగ్రీస్థాయి విభాగంలో తెలుగులో ‘మని విజయనగరం సాంస్కృతిక వైభవం’,అంశాలపై వ్యాసరచన పోటీలుంటాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, డీఈడీ, ఇంజినీరింగ్, మెడిసిన్ ఇలా ఏ డిగ్రీ చదివే వారైన డిగ్రీ స్థాయి పోటీల్లో పాల్గొనవచ్చు.