Distance Education: దూరవిద్య ప్రవేశాలకు దరఖాస్తుల తేదీ పొడగింపు..
సాక్షి ఎడ్యుకేషన్: ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో దూరవిద్య టెన్త్, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాలకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31 వరకు గడువు పొడిగించినట్లు డీఈవో పి.శైలజ మంగళవారం తెలిపారు.
➤ India set to be World's Third-largest Economy: మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
అర్హత గల అభ్యర్థులు ఏపీ ఓపెన్ స్కూల్.ఏపీ.జీవోవీ.సైట్‌లో నమోదు చేసుకుని, సమీపంలోని ఓపెన్ స్కూల్ కేంద్రానికి వెళ్లి అక్కడ ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించి, ఫీజు చెల్లించడం ద్వారా ప్రవేశం పొందాలని సూచించారు. టెన్త్‌లో ప్రవేశానికి గత ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు నిండి ఉండాలని తెలిపారు.
➤ SEAS-2023: పాఠశాల విద్యార్థులకు సీస్ పరీక్షలు..
అడ్మిషన్ కోసం రికార్డ్ షీటు, టీసీతో పాటు అభ్యర్థి ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా పాస్‌బుక్, తల్లిదండ్రుల సామాజికవర్గ ధృవీకరణ పత్రాలతో నేరుగా అడ్మిషన్ పొందవచ్చని పేర్కొన్నారు. ఇంటర్లో ప్రవేశానికి టెన్త్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలని వివరించారు.