TS OPEN School: ఓపెన్ స్కూల్ కోర్సులు రెగ్యులర్‌తో సమానం
Sakshi Education
నల్లగొండ : ఓపెన్ స్కూల్ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ కోర్సులు రెగ్యులర్ విద్యతో సమానమని, ఈ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కూడా పొందవచ్చని డీఈఓ భిక్షపతి పేర్కొన్నారు.
ఓపెన్ స్కూల్ కోర్సులు రెగ్యులర్‌తో సమానం
ఆగస్టు 4న ఓపెన్ స్కూల్ నూతన అడ్మిషన్లకు సంబంధించి కోఆర్డినేటర్లకు నల్లగొండలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యాసకులు తప్పకుండా పర్సనల్ కాంటాక్టు తరగతులకు హాజరు కావాలని, స్టడీ సెంటర్ కో ఆర్టినేటర్లు తమ మండలంలోని అన్ని డిపార్టుమెంట్ల సహకారంతో అడ్మిషన్లు చేపట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ జె.జగదీష్‌కుమార్, స్టడీ సెంటర్ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.