Skip to main content

Open School: ‘ఓపెన్‌’ విధానంపై అవగాహన కల్పించాలి

కొత్తగూడెంఅర్బన్‌: ఓపెన్‌ స్కూల్‌ విధానంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ప్రియాంక ఆల అన్నారు.
Awareness should be created on the open school policy
‘ఓపెన్‌’ విధానంపై అవగాహన కల్పించాలి

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం 2023 – 24 విద్యా సంవత్సర వాల్‌పోస్టర్‌ను ఆగ‌ష్టు 1న‌ విద్యాశాఖాధికారులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరంలో ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్ల నమోదుకు అధికారులంతా సహకరించాలని ఆదేశించారు.

చదవండి: TS Open School: ఓపెన్‌ స్కూల్‌ పోస్టర్లు ఆవిష్కరణ

రెగ్యులర్‌గా పాఠశాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థులతో పాటు, వయోజనులు, గృహిణులు ఓపెన్‌స్కూల్‌ ద్వారా చదువుకునేలా చూడాలని సూచించారు. ఇందులో అడ్మిషన్‌ పొందిన వారు ఉపాధి మార్గాలను వదులుకోకుండా ప్రామాణిక విద్యార్హతను పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ సోమశేఖర శర్మ, ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ మద్దినేని పాపారాపు, సీఎంఓఎస్‌ కె.సైదులు, ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ సతీష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

చదవండి: TS Open Schools: ఓపెన్‌ స్కూల్‌ ఓ వరం

Published date : 02 Aug 2023 03:38PM

Photo Stories