Open schools: ఓపెన్ స్కూల్ విద్య.. రెగ్యులర్ కోర్సులతో సమానం.. అడ్మిషన్లకు చివరి తేదీ
దూర విద్యా విధానంలో పది, ఇంటర్ కోర్సులు పూర్తి చేసుకునేందుకు ఏటా ప్రభుత్వం ఓపెన్ స్కూళ్లు నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు అనుబంధంగా ఓపెన్‌స్కూల్ స్టడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో 42 స్టడీ సెంటర్ల ద్వారా ఓపెన్‌స్కూల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడంతో పది, ఇంటర్ కోర్సులకు అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. \
Nadu Nedu: Revolutionizing AP Govt Schools with AI Technology
రెగ్యులర్ కోర్సులకు సమానంగా ఓపెన్ స్కూల్ ద్వారా విద్యనందిస్తున్నారు. జిల్లాలోని ఆయా స్టడీ సెంటర్లలో పదవ తరగతిలో ఆరు సబ్జెక్టులు, ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. ఓపెన్‌స్కూల్ ద్వారా ఇచ్చే సర్టిపికెట్‌కు ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది. ఆగస్టు 31వ తేదీ నాటికి 14 సంవత్సరాలు నిండిన పిల్లలు పదవ తరగతి అడ్మిషన్‌కు అర్హులు. ఎలాంటి గరిష్ట వయో పరిమితి లేదు. చదవటం, రాయడం తెలిసి ఉండాలి. ఇంటర్ చేరే విద్యార్థులు పదవ తరగతి పాసై రెండేళ్లు పూర్తి అయి ఉండాలి. రెండేళ్ల వ్యవధిలేని విద్యార్థులు ఐదు సబ్జెక్టులు ఒకసారి, మిగిలిన మరో సబ్జెక్టు మరో ఏడాది పరీక్ష రావాల్సి ఉంటుంది.
Andhra Pradesh: Parents and Teachers Meeting in AP Govt Schools #sakshieducation
పదవ తరగతి చేరే పిల్లలు దరఖాస్తుతోపాటు టీసీ, రికార్డు షీటు, పుట్టినతేదీ ధ్రువీకరణపత్రం, ఇంటర్‌లో చేరేందుకు పదవ తరగతి మార్కుల జాబితా, టీసీ, దరఖాస్తుఫాంతోపాటు అందజేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు కులధ్రవీకరణ పత్రాలు, దివ్యాంగులు కులధ్రువీకరణ పత్రాలతోపాటు దివ్యాంగ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. 2022 –23 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతిలో 1,960 మంది విద్యార్థులు, 570 మంది ఇంటర్ విద్యార్థులు అడ్మిషన్లు పొంది పరీక్షలు చేశారు.
Also read: AP Government's e-Pathshala App: Your Gateway to Digital Learning #sakshieducationstudents
దరఖాస్తు ఇలా:
జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాలతోపాటు పాణ్యం మండలంలోని పాణ్యం, గడివేముల మండలాల్లో 42 స్టడీ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. పది, ఇంటర్‌లో చేరే విద్యార్థులు ఆయా కేంద్రాల్లోని ఏఐ కోఆర్డినేటర్ వద్ద దరఖాస్తు ఆన్‌లైన్ చేయించుకుని, అడ్మిషన్ ఫీజు చెల్లించాలి. ఎటువంటి అవపరాధ రుసుం లేకుండా ఈ నెల 31వ తేదీ వరకు ఆన్‌లైన్ అడ్మిషన్ పొందవచ్చు. పదో తరగతిలో జనరల్ విద్యార్థులు రిజిస్ట్రేషన్, అడ్మిషన్ ఫీజు కలిపి రూ. 1,400, అన్ని వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పీహెచ్‌సీ విద్యార్థులు రిజిష్ట్రేషన్, అడ్మిషన్ కలిపి రూ. వెయ్యి చెల్లించాలి. ఇంటర్ చేరే జనరల్ విద్యార్థులు రూ. 1,600, మిగిలిన అన్ని వర్గాల విద్యార్థులు రూ. 1,300 చొప్పున ఫీజు చెల్లించాలి. ఈ ఫీజులకు అదనంగా మీ సేవ చార్జీల రూపంలో రూ. 36 చార్జ్ చేయాలి.
Also read: A Glimpse Inside: Girijana Sankshema Gurukula Patasala @ Maredumilli |Special Story #sakshieducation
సజ్జెక్టులు, తరగతుల వివరాలు ఇలా..
- పదోతరగతికి గ్రూప్– ఏలో ఇంగ్లిష్‌తోపాటు తెలుగు/హిందీ/తమిళం/ ఒరియా తీసుకోవచ్చు. గ్రూప్–బీలో గణితం, సైన్స్, సోషియల్ తీసుకోవాలి.
- ఇంటర్‌లో గ్రూప్–ఏలో ఇంగ్లిష్‌తోపాటు తెలుగు/హిందీ/తమిళం/ ఒరియా తీసుకోవచ్చు. గ్రూప్–బీలో ఆయా గ్రూపులకు సంబంధిచి ప్రధాన సబ్జెక్టుల్లో మూడింటితో కలిపి ఐదు సబ్జెక్టులతో ఇంటర్ పూర్తి చేసుకునే అవకాశం ఉంది.
- ఆయా స్టడీ సెంటర్లలో స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. ఓపెన్ స్కూల్ అడ్మిషన్ పొందిన వారికి ప్రతి ఆదివారం, ప్రతి నెలా రెండో శనివారం ఆయా అధ్యన కేంద్రాల్లో 30 తరగతులు నిర్వహిస్తారు.
- కనీసం 20 తరగతులకు హాజరైన వారిని మాత్రమే మార్చి/ఏప్రిల్ నెలలో నిర్వహించే వార్షిక పరీక్షలకు అనుమతిస్తారు.
- రెగ్యులర్ పాఠశాలల్లో పదోతరగతి, ఇంటర్ చదివి ఉత్తీర్ణులు కాలేకపోతున్న వారు కూడా సార్వత్రిక పాఠశాలల్లో చేరి సులభంగా ఉండే సబ్జెక్టులను ఎంపిక చేసుకుని పాసయ్యే అవకాశం ఉంటుంది.
- రెగ్యులర్ పదోతరగతి, ఇంటర్ ఫెయిలైనప్పటి నుంచి ఐదేళ్లలోపు ఓపెన్‌స్కూల్‌లో చేరితే రెగ్యులర్‌గా పాసైన సబ్జెక్టుల నుంచి ఏవైనా రెండు సబ్జెక్టు మార్కులను బదలాయించుకునే వీలుంటుంది.
- పదిలో హిందీ సబ్జెక్టు మార్కులను మాత్రం బదలాయించరు. పదో తరగతి ఉత్తీర్ణతతనే ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులు ఇంటర్, ఆపై చదువులు సార్వత్రిక విద్యద్వారా పూర్తి చేసుకుని పదోన్నతులు పొందే అవకాశం ఉంది.\
Also read: Sakshi Ground Report: Teaching in Koya Language at Govt Schools in Chinturu #sakshieducation
ఓపెన్‌స్కూల్ ద్వారా ఇంటర్ పూర్తి
పదవ తరగతి పూర్తి చేసుకుని ఆర్మీలో జవాన్‌గా చేరి 18 సంవత్సరాలపాతటు దేశసేవ చేశాను. రిటైర్డ్ అయి వచ్చాక ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పూర్తి చేశాను. దూర విద్యద్వారా ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాను. రెగ్యులర్‌గా చదవలేకపోయినా ఓపెన్ స్కూల్ ద్వారా డిగ్రీ పట్టా తీసుకోవాలన్నదే లక్ష్యం.
– రవికుమార్‌రెడ్డి, మాజీ సైనిక ఉద్యోగి, ఉయ్యాలవాడ
అడ్మిషన్లు జరుగుతున్నాయి
స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 15 సంవత్సరాల నుంచి ఓపెన్‌స్కూల్ స్టడీ సెంటర్ అందుబాటులో ఉంది. 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 40 మంది ఇంటర్‌లో 24 మంది అడ్మిషన్లు పొంది పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ఇప్పటి వరకు పదిహేను మంది అడ్మిషన్లు పొందారు. పది, ఇంటర్‌లో చేరే విద్యార్థులు సార్వత్రిక విద్యను సద్వినియోగం చేసుకోవాలి.
– శ్రీనివాసులు, ఓపెన్‌స్కూల్ కో ఆర్డినేటర్, కోవెలకుంట్ల