Skip to main content

Open Schoolను సద్వినియోగం చేసుకోండి

నేలకొండపల్లి/ముదిగొండ: ఓపెన్‌ స్కూల్‌ విద్యావిధానం ద్వారా పదో తరగతి, ఇంటర్‌ చదివే అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఓపెన్‌ స్కూల్‌ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ ఎం.పాపారావు సూచించారు.
‘ఓపెన్‌ స్కూల్‌’ను సద్వినియోగం చేసుకోండి
‘ఓపెన్‌ స్కూల్‌’ను సద్వినియోగం చేసుకోండి

నేలకొండపల్లి, ముదిగొండల్లో గురువారం ఆయన పోస్టర్లు ఆవిష్కరించడమే కాక వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు అవగాహన కల్పించారు. అనంతరం పాపారావు మాట్లాడు తూ మధ్యలో చదువు మానివేసిన వారే కాకుండా ఉన్నత చదువుపై ఆసక్తి ఉన్న వారు ప్రవేశాలు పొందాలని తెలిపారు.

Also read: Teacher Adjustment: ఉపాధ్యాయ సర్దుబాటులో మినహాయింపులు

14 ఏళ్లు నిండితే పదో తరగతి, 15 ఏళ్లు నిండిన వారు ఇంటర్‌లో చేరొచ్చని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓ జమలారెడ్డి, తహసీల్దార్‌ టి.రామారావుతో పాటు ఉద్యోగులు ఇమ్రాన్‌, సునీత, అశోక్‌రాణి, షేక్‌ నాజర్‌, ఉషారాణి, వహిదా, రవీందర్‌, చిన్నవెంకటేశ్వర్లు, డాక్టర్‌ అరుణాదేవి, దుర్గామల్లేశ్వరి పాల్గొన్నారు.

Also read: APPSC Exams 2023: పోటీ పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు.. August 19 నుంచి యూపీఎస్సీ పరీక్షలు..

Published date : 18 Aug 2023 05:01PM

Photo Stories