Teacher Adjustment: ఉపాధ్యాయ సర్దుబాటులో మినహాయింపులు
పని సర్దుబాటు ప్రక్రియపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో గురువారం సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు, హిందీ భాషల విషయంలో కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నందున సర్‌ప్లస్ లేదన్నారు. 117 జీఓపై చిన్నపాటి మార్పులకు కమిషనర్‌తో చర్చించి పరిష్కరిస్తామన్నారు.
Also read: Jobs in Hetero Drugs: August 21న క్యాంపస్ ఇంటర్వ్యూలు..
పదవీ విరమణ ఏడాదిలోపు ఉన్నవారికి, పీహెచ్‌సీల విషయంలో 75 శాతానికి పైబడిన వైకల్యం ఉన్నవారికి సర్దుబాటులో మినహాయింపు ఇస్తామని, మిగిలిన వారి విషయంలో కూడా పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు. పని సర్దుబాటు ప్రక్రియ తొలుత కాంప్లెక్స్ తర్వాత మండల, డివిజన్ స్థాయిల్లో చేపడతామన్నారు. బదిలీ కోరుకుని రిలీవర్ లేక ఇప్పటికీ ఉన్న 47 మందిని రిలీవ్ చేస్తామని, వారి స్థానంలో పని సర్దుబాటు చేస్తామన్నారు. మిగిలిన సర్‌ప్లస్ ఉపాధ్యాయులను ఎక్కడా అవసరం లేకపోతే ప్రస్తుతం చేస్తున్న చోటే ఉంచేస్తామని హామీ ఇచ్చారు.
Also read: APPSC గ్రూప్-1 2023 ఫలితాలు: టాప్–6 మహిళా అభ్యర్థులు వీరే.. #sakshieducation