Awards: AP టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డులకు దరఖాస్తులు..
Sakshi Education
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఏపీ టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక సాంస్కృతిక అధికారి ఎన్.నారాయణరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 27వ తేదీన నిర్వహించనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ట్రావెల్, టూరిజం ఇండస్ట్రీలోని వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించి ప్రతిభ కనబరిచిన, సేవలందిస్తున్న వారు ఈనెల 19వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు, ఇతర వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టూరిజం.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను వెబ్‌సైట్ ద్వారా అప్‌లోడ్ చేయాలన్నారు. ఎంపికై న వారికి అవార్డులు బహూకరిస్తామని తెలిపారు.
Published date : 11 Sep 2023 09:40AM