History Quiz for Competitive Exams: UPSC సివిల్స్, APPSC మరియు TSPSC వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే కొన్ని టాప్ 60 హిస్టరీ క్విజ్ ప్రశ్నలు క్రింద ఉన్నాయి.
1. కందరీయ మహాదేవ శివాలయాన్ని ఎప్పుడు నిర్మించారు?
1) క్రీ.శ. 888
2) క్రీ.శ. 999
3) క్రీ.శ.1010
4) క్రీ.శ. 1016
- View Answer
- Answer: 2
2. ఢిల్లీ సుల్తాన్ల పాలనా కాలం ఏది?
1) 1206–1526
2) 1216–1536
3) 1226–1526
4) 1236–1546
- View Answer
- Answer: 1
3. షేర్షా తన రాజ్యాన్ని ఎలా విభజించాడు?
1) సుభా
2) సర్కార్
3) ఇక్తా
4)ప్రాంతాలు
- View Answer
- Answer: 2
4. ఛత్రపతి శివాజీ సర్ధార్ చంద్రరావును ఓడించి పొందిన భూభాగం ఏది?
1) తోరణ్
2) కొలబా
3) జావళి
4) అంబర్
- View Answer
- Answer: 3
5. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి ఎప్పుడు మార్చాడు?
1) 1327
2) 1329
3) 1335
4) 1347
- View Answer
- Answer: 3
6. మొగల్ కాలం నాటి యుద్ధమంత్రి ఎవరు?
1) వకీల్
2) మీర్‌భక్షీ
3) వజీర్
4) కొత్వాల్
- View Answer
- Answer: 2
7. షేక్ సలీం చిష్టి సమాధి ఎక్కడ ఉంది?
1) ఫతేపూర్ సిక్రీ
2) లక్నో
3) జైపూర్
4) అజ్మీర్
- View Answer
- Answer: 1
8. భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పాలన ఎప్పుడు అంతమైంది?
1) 1813
2) 1858
3) 1947
4) 1950
- View Answer
- Answer: 2
9. ప్రతీహారులు, పాలరాజులు, రాష్ట్రకూటులు 'త్రైపాక్షిక పోరు'ను ఏ ప్రాంతం కోసం చేశారు?
1) విధర్బ
2) అనార్త
3) కనోజ్
4) అపరాంత
- View Answer
- Answer: 3
10. మొగల్ రాజు షా ఆలం బెంగాల్ పాలకుడిగా ఏ ఆంగ్లేయుడికి హక్కు కల్పించే పత్రాన్ని ఇచ్చాడు?
1) రాబర్ట్ క్లైవ్
2) వెల్లస్లీ
3) వన్సిట్టార్
4) వార్న్ హేస్టింగ్స్
- View Answer
- Answer: 1
11. ఎల్లోరాలో విష్ణువును నరసింహుడిగా చూపుతున్న చిత్రం (15వ గుహ) ఏ రాజుల కాలం నాటిది?
1) గుప్తులు
2) ఛందేలులు
3) రాష్ట్రకూటులు
4) చౌహానులు
- View Answer
- Answer: 3
12. ముంతాజ్ బేగం ఎక్కడ మరణించింది?
1) ఢిల్లీ
2) ఆగ్రా
3) లాహోర్ 4) బుర్హాన్పూర్
- View Answer
- Answer: 4
13. కింది వాటిలో సరికాని జత ఏది?
1) 1504–బాబర్ కాబూల్‌ను వశం చేసుకున్నాడు
2) 1565–తళ్లికోట యుద్ధం జరిగింది
3) 1600–ఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీ స్థాపన
4) 1598–వాస్కోడిగామా భారత్‌కు జల మార్గాన్ని కనిపెట్టాడు
- View Answer
- Answer: 4
14. ఔరంగజేబు ఎప్పుడు మరణించాడు?
1) 1707
2) 1709
3) 1711
4) 1717
- View Answer
- Answer: 1
15. ‘అష్టబిహిష్ట్’ (8 స్వర్గాలు) అనే కళాత్మక శైలి ఏ నిర్మాణంలో భాగం?
1) బులందర్వాజ
2) ఆగ్రాకోట
3) హుమాయున్ సమాధి
4) ఎర్రకోట
- View Answer
- Answer: 3
16. ‘అష్టదిగ్గజాలు’ అనే కవులు సమావేశమయ్యే మందిరం పేరు?
1) పద్మమహల్
2) భువన విజయం
3) ముత్యాలశాల
4) మలయకూటం
- View Answer
- Answer: 2
17. డేరాబాబా నానక్ (కర్తార్‌పూర్) అనే కేంద్రాన్ని స్థాపించింది ఎవరు?
1) గురు నానక్
2) గురు అంగద్
3) గురు అర్జున్‌సింగ్
4) గురు గోవింద్‌సింగ్
- View Answer
- Answer: 1
18. ముస్లింల పవిత్ర న్యాయాన్ని ఏమంటారు?
1) పీట్రాడ్యూరా
2) షరియత్
3) కిబ్లా
4) జకాత్
- View Answer
- Answer: 2
19. హర్మిందర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం) ఎక్కడ ఉంది?
1) భోపాల్
2) లక్నో
3) శ్రీనగర్
4) అమృత్సర్
- View Answer
- Answer: 4
20. క్రీ.శ. 12వ శతాబ్దం మధ్యభాగంలో కర్ణాటకలో వీరశైవ ఉద్యమ ప్రారంభకుడు ఎవరు?
1) ఆదిశంకరాచార్యులు
2) జక్కన
3) బసవన్న
4) చోఖామేళుడు
- View Answer
- Answer: 3
21. గ్రీక్ దేవుడైన ఆర్ఫియస్ గిటారు వాయిస్తున్నట్లు ఉన్న చిత్రం కింది ఏ నిర్మాణంలో ఉంది?
1) ఎర్రకోట
2) పురానాఖిల్లా
3) అలైదర్వాజ
4) జోద్భాయి మహల్
- View Answer
- Answer: 1
22. కింది వారిలో అస్సాంకు చెందిన భక్తి ఉద్యమకారుడు ఎవరు?
1) సంత్ తుకారం
2) ఏక్నాథ్
3) శంకరదేవుడు
4) జ్ఞానేశ్వర్
- View Answer
- Answer: 3
23. హౌజ్–ఇ–సుల్తాని (రాజుగారి జలాశయం) నిర్మాత ఎవరు?
1) కుతుబ్ ఉద్దీన్ ఐబక్
2) ఇల్ టుట్ మిష్
3) బాల్బన్
4) ఆరాంషా
- View Answer
- Answer: 2
24. మధ్య ఆసియాకు చెందిన గొప్ప సూఫీలు ఎవరు?
1) ఘజిలీ
2) రూమీ
3) సాదీ
4) పైవారందరూ
- View Answer
- Answer: 4
25. విజయనగర సామ్రాజ్య స్థాపనా పాలకుడైన హరిహర రాయల పాలనా కాలం?
1) క్రీ.శ. 1336–1357
2) క్రీ.శ. 1336–1346
3) క్రీ.శ. 1336–1347
4) క్రీ.శ. 1336–1367
- View Answer
- Answer: 1
26. రాజులు, నవాబులు తమ రాజ్యంలో శాంతి భద్రతలు కాపాడేందుకు నియమించుకున్న ఆంగ్లేయ అధికారిని ఏమంటారు?
1) వైస్రాయ్
2) గవర్నర్
3) రెసిడెంట్
4) అడ్మిరల్
- View Answer
- Answer: 3
27. కింది వాటిలో సరైన జత ఏది?
1) ప్రతాపరుద్ర చరిత్ర – ఏకామ్రనాథుడు
2) క్రీడాభిరామం – వినుకొండ వల్లభరాయుడు
3) ప్రతాపరుద్ర యశోభూషణం–విద్యా నాథుడు
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
28. పశువుల కాపరుల రక్షణ కోసం, హక్కుల కోసం నెల్లూరు రాజులతో పోరాటం చేసిందెవరు?
1) బాల చంద్రుడు
2) రుద్ర దేవుడు
3) బ్రహ్మనాయుడు
4) కాటమరాజు
- View Answer
- Answer: 4
29. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లేకు మచిలీపట్నాన్ని ఇచ్చిందెవరు?
1) నిజాం ఉల్ ముల్క్
2) నాజర్ జంగ్
3) ముజఫర్ జంగ్
4) బసాలత్ జంగ్
- View Answer
- Answer: 3
30. కాకతీయుల వంశ దైవం ఎవరు?
1) విరూపాక్షుడు
2) స్వయంభూదేవుడు
3) స్కంధ కార్తికేయుడు
4) అనంత పద్మనాభస్వామి
- View Answer
- Answer: 2
31. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో బయల్పడిన చోళుల గ్రామ పరిపాలనను తెలిపే శాసనం ఎక్కడ ఉంది?
1) మహాబలిపురం
2) తంజావూరు
3) ఉత్తర మేరూర్
4) చిదంబరం
- View Answer
- Answer: 3
32. చంద్రగిరి శాసనాల్లో పేర్కొన్న దండనాయకుడు ఎవరు?
1) విరూపన్న
2) సిద్ధప్ప
3) తిమ్మయ్య
4) సర్వప్ప
- View Answer
- Answer: 3
33. ‘ఆండాళ్’ అనే తమిళ కవయిత్రి గురించి తెలిపే గ్రంథం?
1) పల్నాటి వీర చరిత్ర
2) ఆముక్తమాల్యద
3) పాండురంగ మహాత్యం
4) క్రీడాభిరామం
- View Answer
- Answer: 2
34. ‘నామ్‌ఘర్ అనే పేరుతో మందిరాలను ఏర్పాటు చేసే సంప్రదాయాన్ని నెలకొల్పిందెవరు?
1) తులసీదాస్
2) రవిదాసు
3) శంకరదేవుడు
4) కర్మమేలుడు
- View Answer
- Answer: 3
35. ఓరుగల్లు నగరాన్ని ఎలా విభజించారు?
1) వాడలు
2) నాడులు
3) వలనాడులు
4) అమరంలు
- View Answer
- Answer: 1
36. సూఫీ గురువులు సమావేశాలను ఎక్కడ నిర్వహిస్తారు?
1) దర్గాల్లో
2) ఖాన్ కాహ్లలో
3) మసీదుల్లో
4) మదరసాల్లో
- View Answer
- Answer: 2
37. కాకతీయుల కాలంలో కళ్యాణ కేశవ దేవాలయం సేవకులకు ‘క్రంజ’ అనే గ్రామంలో భూమిని దానం చేసింది ఎవరు?
1) ఏకామ్రనాథుడు
2) రేచర్ల రుద్రుడు
3) పువ్వుల ముమ్మిడి
4) బొల్లి నాయకుడు
- View Answer
- Answer: 4
38. కాశ్మీర్ రాజుల చరిత్ర రాసిన కల్హణుడు ఏ శతాబ్దానికి చెందినవాడు?
1) క్రీ.శ. 9
2) క్రీ.శ. 10
3) క్రీ.శ. 11
4) క్రీ.శ. 12
- View Answer
- Answer: 4
39. ‘పద కవితా పితామహుడు’ అని ఎవరిని అంటారు?
1) కంచర్ల గోపన్న
2) తాళ్లపాక అన్నమాచార్య
3) బమ్మెర పోతన్న
4) చైతన్య మహాప్రభు
- View Answer
- Answer: 2
40. శాసనాలు అధ్యయనం చేయడం ఆధారంగా చేసుకొని అందులో రాజుల వంశావళి తెలిపేది?
1) దండకం
2) రూపకం
3) ప్రశస్థి
4) ఏకాంకి
- View Answer
- Answer: 3
41. కింది వాటిలో సరైన జత ఏది?
1) నిశుంభ సూదిని దేవాలయం–తంజావూరు
2) ఏకాంబరేశ్వర ఆలయం – కాంచీపురం
3) హజార రామాలయం – హంపి
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
42. రాష్ట్రకూటులు ఎవరి సామంతులు?
1) చాళుక్యులు
2) పల్లవులు
3) కదంబులు
4) పాండ్యులు
- View Answer
- Answer: 1
43. అరబిక్ భాషలో ‘కితాబ్–ఉల్–హింద్’ రాసిందెవరు?
1) ఫిరదౌసి
2) ఆల్ బెరూనీ
3) ఇబన్ బటూటా
4) న్యూనిజ్
- View Answer
- Answer: 2
44. ‘ఇక్తా’ అనే విభాగంపై రెవెన్యూ వసూలు చేసే అధికారులను ఏమంటారు?
1) అమీర్
2) బితిక్చి
3) పోతేదార్
4) సుబేదార్
- View Answer
- Answer: 1
45. కింది వారిలో కదంబ రాజవంశానికి చెందిన వారెవరు?
1) నాగభట్టు
2) దంతిదుర్గుడు
3) హరిశ్చంద్రుడు
4) మయూర శర్మ
- View Answer
- Answer: 4
46. క్రీ.శ. 1191లో ఘోరీ మహమ్మద్‌ను ఓడించింది ఎవరు?
1) మొదటి రాజరాజు
2) మూడో పృథ్వీరాజ్
3) విజయాలయుడు
4) నాగభట్టు
- View Answer
- Answer: 2
47. రాష్ట్రకూటుల కాలం నాటి ‘హిరణ్యగర్భ’ అనేది ఏమిటి?
1) సంస్కార విధి
2) నాణెం
3) శాసనం
4) రాజనీతి గ్రంథం
- View Answer
- Answer: 1
48. కింది వాటిలో చోళుల కాలం నాటి బిరుదు ఏది?
1) పళ్లిచ్ఛందం
2) వెల్లన్ వాగై
3) మువ్వేంద వేలన్
4) తిరునామత్తుకని
- View Answer
- Answer: 3
49. ధంగదేవుడు నిర్మించిన ఆలయం ఏది?
1) వేయి స్తంభాల గుడి
2) కళ్యాణ కేశవాలయం
3) ఛాయ సోమేశ్వరాలయం
4) కందరీయ మహాదేవ శివాలయం
- View Answer
- Answer: 4
50. కింది వాటిలో నిర్మాణ శైలికి సంబంధించిన పదం ఏది?
1) ట్రాబీట్ లేదా కార్ బెల్ట్
2) కిబ్లా
3) స్టక్కో
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
51. పులయులు (అదనూరు) అనే వ్యవసాయ కూలీల జీవన పరిస్థితులను తెలియజేసే 12వ శతాబ్దం నాటి గ్రంథం ఏది?
1) ప్రతాపరుద్ర చరిత్ర
2) క్రీడాభిరామం
3) ఆముక్త మాల్యద
4) పెరియపురాణం
- View Answer
- Answer: 4
52. కింది వాటిలో సరైన జత ఏది?
1) శ్రీమార వల్లభుడు – పాండ్య రాజు
2) రుద్రదేవుడు – కాకతీయ రాజు
3) ధంగదేవుడు – ఛందేలరాజు
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
53. చోళరాజు మొదటి రాజేంద్ర భైరవుని ప్రతిరూపాన్ని ఎవరి వద్ద నుంచి పొందాడు?
1) తూర్పు చాళుక్యులు
2) పాల రాజులు
3) కళింగ రాజులు
4) నవీన పాండ్యులు
- View Answer
- Answer: 3
54. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో బహదూర్షా జఫర్‌ను అరెస్ట్ చేసింది ఎవరు?
1) కెప్టెన్ హడ్సన్
2) హెచ్.సి. బ్రిగ్స్
3) అడ్మిరల్ వాట్సన్
4) కల్నల్ డేవిడ్సన్
- View Answer
- Answer: 1
55. మహానవమి దిబ్బను నిర్మించిన రాజులు ఎవరు?
1) కాకతీయులు
2) విజయనగర రాజులు
3) మొగలులు
4) కుతుబ్‌షాహీలు
- View Answer
- Answer: 2
56. మొదటి రాజేంద్ర చోళుడికి సమకాలీనుడెవరు?
1) గజనీ మహమ్మద్
2) నాదిర్షా
3) గోరీ మహమ్మద్
4) అహ్మద్‌షా అబ్దాలీ
- View Answer
- Answer: 1
57. జతపరచండి.
జాబితా–I జాబితా–II
ఎ) మార్కోపోలో a) చైనా
బీ) ఇబన్ బటూటా b) పర్షియా
సీ) అబ్దుల్ రజాక్ c) ఇటలీ
డీ) డోమింగోఫేస్ d) పోర్చుగల్
ఈ) పాహియాన్ e) మొరాకో
1)a-i, b-ii, c-iii, d-v, e-iv
2) a-iii, b-v, c-ii, d-iv, e-i
3) a-iv, b-iii, c-i, d-ii, e-v
4) a-v, b-i, c-iv, d-iii, e-ii
- View Answer
- Answer: 2
58. కింది వాటిలో సరైన జత ఏది?
1) హరేకృష్ణ మంత్రం – చైతన్య మహాప్రభు
2) దాశరథీ శతకం – కంచర్ల గోపన్న
3) సహజ కవి – పోతన
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
59. మీరాబాయి గురువు ఎవరు?
1) రవిదాసు
2) దాదుదయాళు
3) గురునానక్
4) కబీర్
- View Answer
- Answer: 1
60. క్రీ.శ. 1323లో కాకతీయ సామ్రాజ్యం ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యంలో విలీనమయ్యే నాటికి ఢిల్లీ సార్వభౌముడు ఎవరు?
1) అల్లావుద్దీన్ ఖీల్జీ
2) మహమ్మద్ బిన్ తుగ్లక్
3) ఘియాజుద్దీన్ తుగ్లక్
4) బాల్బన్
- View Answer
- Answer: 3
61. షోడశ మహాజనపదాల్లో ‘శ్రావస్తి’ ఏ జనపథం రాజధాని?
1) కోసల
2) వత్స
3) అవంతి
4) గాంధార
- View Answer
- Answer: 1
Tags
- Trending Quiz for APPSC TSPSC Competitive Exams
- History Quiz for Competitive Exams
- UPSC
- APPSC
- APPSC Bitbank
- TSPSC
- TSPSC Study Material
- Quiz
- Current Affairs Quiz
- latest quiz
- History Quiz
- Competitive Exams
- Exam preparation
- Test your knowledge
- Quiz competitions
- Mock Tests
- Practice Tests
- Quiz Questions
- General knowledge quiz
- Exam quizzes
- Aptitude Test
- Reasoning quiz
- Quantitative Aptitude
- Verbal ability
- Telugu Quiz
- Exam Strategies
- current affairs in history questions