Jobs in Hetero Drugs: August 21న క్యాంపస్ ఇంటర్వ్యూలు..
Sakshi Education
గాజువాక : ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యూనిట్లలో ఉద్యోగాల భర్తీకి ఈనెల 21న స్థానిక టీఎస్సార్, టీబీకే డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.విష్ణువర్థన్‌రావు తెలిపారు.
హెటిరో డ్రగ్స్
ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విద్యార్థులు, 2019–2023 మధ్య బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసి 26 ఏళ్ల లోపు వయస్సుగల అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చన్నారు. ఎంపికై న అభ్యర్థులకు వార్షిక వేతనం రూ.2.70 లక్షల నుంచి రూ.2.80 లక్షల వరకు ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ బయోడేటా, గుర్తింపు కార్డు, విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని తెలిపారు.