Tenth Students : విద్యార్థులకు సెలవుల్లోనూ భోజనం అందించాలి.. సర్కార్ కీలక ఆదేశం..

సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు కూటమి ప్రభుత్వం మంచి వార్తను వినిపించింది. ఇకపై విద్యార్థులకు సెలవుల్లో కూడా భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. ఏపీ కూటమి ప్రభుత్వం ఈ మెరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
Mid Day Meal Share: బడుల్లో ‘మధ్యాహ్న భోజనం’ ఖర్చులో.. కేంద్ర.. రాష్ట్రాల.. వాటా ఎంతో తెలుసా?
ఈ తేదీల్లో భోజన వసతి..
ఏపీ పదో తరగతి విద్యార్థులకు సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు రెండు రెండో శనివారాలు, ఆరు ఆదివారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో విద్యార్థులకు భోజనం అందించాలని ఇప్పటికే ఉత్వర్తులు వెలువడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.
కాగా ఇప్పటికే రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ, అదనపు తరగతుల నిర్వహణ, ప్రిపరేషన్, పదోతరగతి పరీక్షల బ్లూప్రింట్ ప్రకారం ప్రీఫైనల్, గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ ప్రణాళికలో సూచించినట్టు ఆదివారం కూడా నిర్ణీత సబ్జెక్టులు బోధించాల్సి ఉంటుంది. మార్చి 10వ తేదీ వరకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని విద్యాశాఖ పాఠశాలలను ఆదేశించింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Tenth Class
- AP government
- Education Department
- ap tenth class students
- food facility for students
- ap tenth public exams 2025
- ap school students
- food facilities for tenth students
- food facility during holidays
- AP education department
- tenth students of ap
- Andhra Pradesh
- ap cm chandrababu naidu
- students health
- students food facility in schools
- Education News
- Sakshi Education News
- Andhra Pradesh welfare schemes
- ap education news