Australia New Visa Rules: ఆస్ట్రేలియాలో చదవాలనుకునే వారికి అలర్ట్.. వీసా నిబంధనల్లో మార్పులు
Sakshi Education
విదేశీ విద్యార్థుల వలసలను తగ్గించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. వచ్చే రెండేళ్లల్లో వలసలను తగ్గించేలా వీసా నిబంధనల్లో కీలక మార్పులకు సిద్ధమైంది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి యూనివర్శిటీకి 80% నిర్ణీత కోటాను విధించనున్నారు. అంటే, ప్రతి యూనివర్సిటీలో ప్రభుత్వం అనుమతించిన నిర్ణీత కోటా మేరకే వీసాలను ప్రధానంగా ప్రాసెస్ చేస్తారు. యూనివర్శిటీ 80% లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత, మిగిలిన 20% విద్యార్థుల వీసాల జారీ మందకోడిగా సాగనుంది.
Australia New Visa Rules For International Students
ఇందుకోసం..2025 నుంచి ప్రతిఏటా 2,70,000 మంది విదేశీ విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే దీనివల్ల వృత్తి విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుందని, ఇది ఇది ఆర్థిక విధ్వంసమని పలు యూనివర్శిటీలు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించాయి.
దీంతో వీసా అమలులో "గో-స్లో" అనే విధానాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే 80% లక్ష్యాన్ని చేరుకున్న విద్యాసంస్థలకు మంచి ప్రాసెసింగ్, దాని తరువాత వీసా ప్రాసెసింగ్ స్లోగా చేపడతారు. తాజా మార్పులతో అంతర్జాతీయ విద్యార్థుల వలసలను భారీగా తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.