USA Changes H-1B Visa Rules: హెచ్–1బీ వీసా సులభతరం.. హెచ్–1బీ వీసా పొందుతున్న వారిలో అధికంగా ఈ దేశస్థులే!

అమెరికా కంపెనీలు తమ ఉద్యోగాల కోసం విదేశీయులను ఎంపికచేసుకునే ప్రక్రియను సులభతరంచేయడం ఇందుకు మరో కారణం. నైపుణ్య ఉద్యోగాలకు సంబంధించిన వీసాల జారీ, అనుమతి ప్రక్రియలను వేగవంతం చేయడం, నిబంధనల సడలింపు ప్రక్రియ వంటి నిర్ణయాలు 2025 జనవరి 17వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఎఫ్–1 విద్యార్థి వీసాలతో అమెరికాలోకి అడుగుపెట్టిన భారతీయులు ఇకపై సులువుగా తమ వీసాను హెచ్–1బీ వీసాగా మార్చుకోవచ్చు. దీంతో వీరికి అక్కడి కంపెనీలు వేగంగా ఉద్యోగాలు కల్పించేందుకు వీలవుతుంది. థిరిటికల్, టెక్నికల్ నిపుణులుగా వీరికి ఉద్యోగాచ్చేందుకు అక్కడి సంస్థలకు అవకాశం చిక్కుతుంది.
చదవండి: MIT Suspends Indian Origin Student: అమెరికాలో భారత విద్యార్థి కెరియర్ నాశనం.. ఆ ఫొటో కారణమా?
అంతర్జాతీయ మార్కెట్‌లకు తగ్గట్లుగా, ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా అమెరికన్ సంస్థలను తీర్చిదిద్దే లక్ష్యంతో వీసా నిబంధనలను సడలిస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిసెంబర్ 18న ప్రకటించింది. అమెరికా సంస్థలు కార్మిక కొరత సమస్యను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ ప్రభుత్వం పేర్కొంది. జనవరి 20వ తేదీన నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయడానికి కొద్దిరోజుల ముందు బైడెన్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
హెచ్–1బీ వీసాల జారీ ప్రక్రియను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) వేగ వంతం చేయనుంది. ‘‘హెచ్–1బీ వీసా విధానం ద్వారా అమెరికా సంస్థలు అత్యంత నైపుణ్యమైన ఉద్యోగులకు నియమించుకునే అవకాశాలను విస్తృతంచేశాం. దీంతో అంతర్జాతీయ మేధతో అన్ని రంగాల్లో అమెరికా ఎంతో ప్రయోజనం పొందనుంది’’అని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ మంత్రి అలెజాండ్రో ఎన్.మయోర్కాస్ చెప్పారు.
‘‘1990లో హెచ్–1బీ విధానం మొదలెట్టాక అమెరికా దేశ ఆర్థికాభివృద్ధికి అనుగుణంగా ఈ పద్దతిని నవీకరించాల్సిన అవసరం ఇంతవరకు రాలేదు’’అని యూఎస్‌సీఐఎస్ డైరెక్టర్ ఎం.జడ్డూ హెచ్–1బీ విధానాన్ని మెచ్చుకున్నారు.
చదవండి: Studying In America: అమెరికాలో భారత విద్యార్థులే టాప్.. ఆ కోర్సుల్లో ఎక్కువగా అడ్మిషన్స్
భారతీయులకు ఏ రకంగా ఉపయోగం?
యూఎస్‌సీఐఎస్ ద్వారా హోంల్యాండ్ సెక్యూ రిటీ విభాగం ఏటా లాటరీ విధానం ద్వారా కేవలం 65,000 వరకు హెచ్–1బీ వీసాలనే జారీచేసేది. అడ్వాన్స్‌డ్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఉన్న సందర్భాల్లో మరో 20వేల హెచ్– 1బీ వీసాలనే ఇచ్చేది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ఈ కోటా పరిమితి అనేది ఇన్నాళ్లూ లాభాపేక్షలేని, ప్రభుత్వ సంబంధ పరిశోధనా సంస్థలకు లేదు. దీంతో ఈ నిబంధనలోని లొసుగును దుర్వినియోగం చేస్తూ చాలా మంది ‘రీసెర్చ్’మాటున వీసాలు సాధించారని, దీంతో భారత్ నుంచి వచ్చే నైపుణ్య అభ్యర్థులకు లాటరీ ద్వారా వీసా పొందే అవకాశాలు తగ్గిపోయాయని ఆరోపణలు ఉండేవి.
దీంతో వీటికి చెక్ పెడుతూ ఇకపై లాభాపేక్షలేని, ప్రభుత్వ సంబంధ పరిశోధనా సంస్థలకు తొలిసారిగా కోటా పరిమితిని విధిస్తూ, కోటాను నిర్వచిస్తూ నిబంధనల్లో మార్పులు తెచ్చారు. దీంతో నాన్‌ప్రాఫిట్, గవర్నమెంటల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ నుంచి పోటీ తగ్గి ఆ మేరకు భారతీయులకు లాటరీలో అధిక ప్రాధాన్యత, లబ్ధిచేకూరుతుందని భావిస్తున్నా రు. ప్రతి ఏటా హెచ్–1బీ వీసా పొందుతున్న వారిలో భారత్, చైనా దేశస్థులే అధికంగా ఉంటున్నారు.