Foreign Students : విదేశీ విద్యార్థులకు వర్సిటీల కీలక సూచన.. ట్రంప్ ప్రమాణానికి ముందే..
వీసాల విషయంలో ట్రంప్ పద్ధతులతో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొరాకుండా ఉండేందుకు వర్సిటీలు విద్యార్థులకు మెసేజులు పెడుతున్నారు. అమెరికా విశ్వవిద్యాలయాలు, భారతదేశం నుంచి సైతం పలువురు విద్యార్థులను, జనవరి 20కి ముందు అమెరికాకు తిరిగి రావాలని సూచిస్తున్నాయి. ఈ తేదీకి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న నేపధ్యంలో, ఇమ్మిగ్రేషన్ సమస్యలపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
ఆంక్షలు ఉండవచ్చనే భయాలు
గత ప్రభుత్వ హయాంలో H-1B వీసాదారులపై కఠిన నిర్ణయాలు తీసుకున్నందున, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి వీసాలకు కూడా ఇలాంటి ఆంక్షలు ఉండవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో, శీతాకాల విరామంలో స్వదేశానికి వెళ్లిన విద్యార్థులు, వారి చదువులకు ఇబ్బందులు రాకుండా ముందుగానే తిరిగి రావాలని విశ్వవిద్యాలయాలు సూచిస్తున్నాయి.
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలపై అనిశ్చితి నెలకొన్నందున, విదేశీ విద్యార్థులు ఎలాంటి మార్పుల వల్ల వారి వీసా స్థితి లేదా దేశంలో ప్రవేశంపై ప్రభావం పడుతుందో తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
గతంలో కూడా విద్యార్థులు సెలవుల తర్వాత తిరిగి వచ్చేటప్పుడు అమెరికాలో ప్రవేశం నిరాకరించబడిన ఉదంతాలు ఉన్నాయి, ముఖ్యంగా వారి పార్ట్‌టైమ్ ఉద్యోగాల కారణంగా. ఈసారి, యూనివర్సిటీ వర్గాలు, ఇలాంటి సమస్యలు మరింత మందికి ఎదురవచ్చని అంచనా వేస్తున్నాయి.