Skip to main content

Canada Work Permits New Rules: కెనడా వెళ్లే విద్యార్థులకు ఝలక్‌ ఇచ్చిన ట్రూడో సర్కార్‌

Justin Trudeau announcing decision on study permits  Canadian government statement on study permit reduction Canada Work Permits New Rules Canada Tightens Study and Work Permits

ఒట్టావా: కెనడాలోని జస్టిన్‌ ట్రూడో సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులకు షాకిస్తూ 2025లో స్టడీ పర్మిట్లను తగ్గించేందుకు సిద్ధమైంది. తమ దేశంలో తాత్కాలిక నివాసితుల రాకపోకలను తగ్గించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.  

కెనడాలో వలసల నియంత్రణకు జస్టిన్‌ ట్రూడో సర్కార్‌ సిద్ధమైంది. ఇందులో భాగంగా విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్స్‌, వర్కర్ల పని అనుమతుల విషయంలో మరిన్ని ఆంక్షలు విధించేలా ప్లాన్‌ చేసింది. 2025లో కొత్త అంతర్జాతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లు 10 శాతం మేర తగ్గించబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Software Company Layoffs: భారీగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ టెక్‌ కంపెనీ.. 5600 మంది అవుట్‌

2024లో జారీ చేయాల‌ని లక్ష్యంగా పెట్టుకున్న 4,85,000 నుంచి 10 శాతం త‌గ్గితే కేవ‌లం 4,37,000 మందికి మాత్రమే స్టడీ పర్మిట్లు అందుతాయ‌ని స్పష్టం చేసింది. ఇక, 2025లో జారీ చేసే స్టడీ పర్మిట్‌ల సంఖ్య 2026లో కూడా ఎలాంటి మార్పులు ఉండదని ప్రకటించారు. అంతకుముందు.. 2023లో ఈ సంఖ్య 5,09,390గా ఉండగా.. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 1,75,920 స్టడీ పర్మిట్లను జారీ చేశారు.

ITI Counselling: ఈనెల 28న ఐటీఐ నాలుగో విడత కౌన్సెలింగ్‌

 మరోవైపు..కెనడా జనాభా 2024 మొదటి త్రైమాసికంలో 41 మిలియన్లకు పైగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో తాత్కాలిక నివాసితులలో భారీ పెరుగుదల కనిపించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, దేశీయంగా పెరుగుతున్న ఇళ్ల కొరత, నిరుద్యోగ సమస్యకు చెక్‌ పెట్టడంలో భాగంగానే ఇలా షరతులు విధించినట్టు తెలుస్తోంది.

Published date : 19 Sep 2024 11:48AM

Photo Stories