Skip to main content

Trump Statues: బుద్ధుడిలా డొనాల్డ్ ట్రంప్‌ విగ్రహాలు

డొనాల్డ్‌ ట్రంప్‌.. ఎప్పుడూ కాసింత చిరాకు ప్రతిబింబించే ముఖం.
Chinese Artist Cashes In On Buddha-like Donald Trump Statues

అలాంటి ముఖానికి హాంగ్‌ జిన్‌ షి అనే చైనా గ్రామీణ కళాకారుడు బుద్ధుడి ప్రశాంతతను ఆపాదించాడు. శాంతచిత్తంతో ఉన్న ట్రంప్‌ విగ్రహాలను తయారు చేశాడు. బుద్ధుని మాదిరిగా కళ్లు మూసుకుని దైవ చింతనలో కూర్చుని ఉన్న విగ్రహాలను పింగాణీతో రూపొందించాడు. 

సైజును బట్టి వీటిని 140 నుంచి 2,700 డాలర్ల దాకా విక్రయిస్తున్నాడు. 2021లో ఇ–కామర్స్‌ ప్లాట్‌ఫాం టావోబావోలో వైరలైన ఈ ట్రంప్‌ విగ్రహాలు ఆయన రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో మరోసారి ఆకర్షిస్తున్నాయి. 

PM Shinawatra: తన ఆస్తుల వివరాలు ప్రకటించిన థాయ్‌లాండ్‌ ప్రధాని.. వాటి విలువ ఎంతంటే?

సరదాగా మొదలెట్టి..
47 ఏళ్ల హాంగ్‌ ఇప్పటిదాకా కొన్ని వందల సిరామిక్‌ వస్తువులను తయారు చేశాడు. ‘రాజకీయ నాయకులు సాధారణంగా బోరింగ్‌గా ఉంటారు. కానీ ట్రంప్‌ అందుకు భిన్నమైన నేత. అందుకే తొలుత సరదాగా ఆయన విగ్రహాలను రూపొందించా. ట్రంప్‌ వ్యక్తిత్వం, విగ్రహం ఆకారం పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. దాంతో వాటిని కొనేందుకు బాగా ఇష్టపడుతున్నారు’ అని చెప్పుకొచ్చాడు.

‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ నినాదంతో ట్రంప్‌ గెలిస్తే, హాంగ్‌ మాత్రం ప్రతి విగ్రహం ప్యాక్‌పైనా ‘మీ కంపెనీని మళ్లీ గొప్పగా చేయండి’ అని రాస్తున్నాడు. దీన్ని అనుసరిస్తూ అమెరికాలో పలు ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఫ్లాట్‌ఫాంలలో కొన్ని వెర్షన్లు వచ్చాయి. ట్రంప్‌ పాలనలో ప్రధాన పాత్ర పోషించనున్న కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ విగ్రహాన్ని కూడా హాంగ్‌ డిజైన్‌ చేస్తున్నాడు. అందులో మస్క్‌ను ఐరన్‌ మ్యాన్‌గా చూపిస్తున్నాడు. ట్రంప్‌కు చైనాలో ఇప్పటికీ చాలామంది అభిమానులున్నారని చెప్పారు. 

Year Ender 2024: ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన 10 అంశాలు ఇవే..

Published date : 15 Jan 2025 12:19PM

Photo Stories