Skip to main content

Canada Work Permit Rules Changed: వర్క్‌ పర్మిట్‌లో కీలక మార్పులు చేసిన కెనడా ప్రభుత్వం

Canada Work Permit Rules Changed
Canada Work Permit Rules Changed

కెనడా వెళ్లాలనుకునే విదేశీ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. నవంబర్‌ 1 నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌ వర్క్‌ పర్మిట్‌ వీసా ప్రోగ్రామ్‌లో కీలక మార్పులు చేసేందుకు  సిద్ధమైంది. విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లను తగ్గించేందుకు ఇప్పటికే ఆంక్షలు విధించిన కెనడా ప్రభుత్వం ఇప్పుడు తమ దేశంలో తాత్కాలిక నివాసితుల రాకపోకలను తగ్గించనుంది. ఇందులో భాగంగానే పలు నిబంధనలు తీసుకొచ్చింది. 

పోస్ట్‌ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్
పోస్ట్‌ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ (PGWP)  అనేది కెనడాలో చదువులు పూర్తయిన తర్వాత విదేశీ విద్యార్థులకు మంజూరు చేసే ఓపెన్ వర్క్ పర్మిట్. PGWP హోల్డర్‌లు కెనడాలో ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా తమకు నచ్చినన్ని గంటలు పని చేసుకోవచ్చు. అయితే  పీజీడబ్ల్యూపీకి అప్లై చేసుకోవాలంటే ఇకపై కొత్త నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

Jobs In SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 10వేల ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే

 

  • మీరు ఇంగ్లీష్ లేదా ఫ్రెంచ్‌లో కనడా భాషా బెంచ్‌మార్క్స్ (CLB)లో 7 లేదా అంతకంటే ఎక్కవ స్కోర్‌ చేయాల్సి ఉంటుంది. కాలేజ్‌ ప్రోగ్రాం నుంచి గ్రాడ్యుయేషన్‌ పొందితే  సీఎల్‌బీ స్కోర్‌ తప్పకుండా 7 కంటే మెరుగ్గా ఉండాలి. గతంలో 5 స్కోర్‌ చేస్తే సరిపోయేది. ఇప్పుడు సీఎల్‌బీ స్కోరును పెంచారు.
     
  • పోస్ట్‌ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ కోసం ఇప్పటికే లేదా నవంబర్‌ 1 లోగా దరఖాస్తు చేసుకుంటే, గతంలో ఉన్న  నిబంధనల ప్రకారం PGWP మంజూరు అవుతుంది. నవంబర్‌ 1 తర్వాత నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 07 Oct 2024 05:49PM

Photo Stories