Foreign Education: విదేశీ విద్యపై అవగాహన పెరగాలి
Sakshi Education
సాక్షి, సిటీబ్యూరో: విదేశీ విద్యపై అవగాహన పెరిగేకొద్దీ, మరింత ఎక్కువ మంది విద్యార్థులు అంతర్జాతీయ విద్య చదవడానికి ప్రయత్నిస్తారని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు.
నగరానికి చెందిన టెక్సాస్ రివ్యూ ఆధ్వర్యంలో బేగంపేటలోని మారిగోల్డ్ హోటల్‌లో వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ జరిగింది. ఈ ఫెయిర్‌కు యుఎస్‌ఏ , యుకె , ఫ్రాన్స్, జర్మనీ సహా 13 దేశాలకు చెందిన 75 పైగా విశ్వవిద్యాలయాల ప్రతినిధులు హాజరయ్యారు.
చదవండి: Foreign Language : ఫారెన్ లాంగ్వేజ్ నిపుణులకు డిమాండ్.. విదేశీ భాషల నైపుణ్యంతో ఉద్యోగాలు
ఈ సందర్భంగా టెక్సాస్ రివ్యూ సహ–వ్యవస్థాపకుడు సీఈఓ రాజేష్ దాసరి మాట్లాడుతూ యూఎస్, యూకె చాలా మంది విద్యార్థులకు ఇష్టపడే గమ్యస్థానాలు అయినప్పటికీ, అనేక యూరోపియన్ దేశాలు కూడా అసాధారణమైన విద్యా ప్రమాణాలను అందిస్తున్నాయన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 11 Nov 2024 12:54PM