Overseas Vidya Nidhi scholarship: విదేశీ విద్యకు రూ. 20 లక్షల ఉపకారవేతనం.. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..
మంచిర్యాలటౌన్: విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతికి చెందిన ఎస్సీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం విదేశి విద్యానిధి పథకం ద్వారా చేయూత అందిస్తోంది. ఏదేని డిగ్రీ పూర్తి చేసి ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లాలని ఆసక్తి ఉన్నవారికి అందుకు అవసరమయ్యేందుకు గానూ విడతకు రూ.10 లక్షల చొప్పున రెండు విడతల్లో రూ.20లక్షలు అందిస్తుంది.
నిరుపేద, మధ్యతరగతికి చెందిన ఎస్సీ విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరిట రుణాలు అందిస్తున్నారు. 2014–15లో ఎస్సీ, ఎస్టీలకు ఈ పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తుండగా అవగాహన లేకపోవడంతో పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.
Job Mela: నిరుద్యోగుల కోసం జాబ్‌మేళా.. ఎప్పుడు? ఎక్కడంటే..
అర్హతలు, కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు
- అంబేద్కర్ విదేశి విద్యానిధి పథకం కోసం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు 2024 జూలై 1 నాటికి గరిష్ట వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి.
- ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ టెస్టులో ప్రతిభ ఉన్న విద్యార్థులకు అవకాశం ఉండగా ఒక కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంది.
- ఇంజినీరింగ్ సైన్స్, మేనేజ్‌మెంట్, వ్యవసాయం, నర్సింగ్, సామాజికశాస్త్రం కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది.
- టోఫెల్‌లో 60 శాతం, ఐఈఎల్‌టీఎస్‌లో 8.0 శాతం మార్కులు, జీఆర్‌ఈ, జీమ్యాట్‌లో 50 శాతం అర్హత మార్కులు పొందాలి.
- పీజీ, పీహెచ్‌డి చేసే విద్యార్థులు డిగ్రీలో 60 శాతం మార్కులు సాధించాలి.
Job Mela: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా.. వివరాలు ఇవే
కావల్సిన సర్టిఫికేట్లు
విద్యార్థుల కులం, ఆదాయం, జనన ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్‌కార్డు, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ మార్కుల మెమోలు, టోఫెల్, ఐఈఎల్, టీఎస్‌జీఆర్‌ఈ, జీమ్యాట్ అర్హత, విదేశాల్లో విధ్యాభ్యాసం చేసేందుకు సంబంధిత కళాశాల నుంచి పంపిన ప్రవేశ అనుమతి పత్రం, కళాశాల ప్రవేశ రుసుం చెల్లించిన రశీదు, బ్యాంకు ఖాతా పుస్తకాలు ఉండాలి. సంబంధిత ధృవపత్రాల ఆధారంగా ఆన్‌లైన్‌లో తెలంగాణ ఈ–పాస్ వెబ్‌సైట్ https://telangana.epass.cgg.gov.in లో అక్టోబర్ 13 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
సద్వినియోగం చేసుకోవాలి
విదేశాల్లో విద్యను అభ్యసించాలనే ఆసక్తి ఉండి అర్హులైన విద్యార్థులకు విదేశీ విద్యానిధి పథకం ద్వారా ప్రభుత్వం రూ.20 లక్షల రుణం అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. విదేశాల్లో చదవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– రవీందర్‌రెడ్డి, జిల్లా షెడ్యూల్డ్ కులాల
అభివృద్ధి అధికారి, మంచిర్యాల
Tags
- Scholarships
- Latest scholarships
- Govt scholarships
- Scholarship Program
- Study Abroad
- Study Abroad
- abroad study
- Study in Abroad
- Scholarship latest news
- Educational qualifications
- Foreign Education Fund Scheme
- Ambedkar Overseas Education Fund
- State government education scheme
- Foreign study financial aid