NASA Chief: నాసా ఛీఫ్‌గా బిలియనీర్ వ్యోమగామి జేర్డ్ ఐజాక్‌మన్
ఫ్లోరిడా డెమొక్రటిక్ మాజీ సెనేటర్ బిల్ నెల్సన్ స్థానంలో జేర్డ్ ఇకపై నాసా అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. హైస్కూల్ డ్రాపవుట్ నుంచి అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తగా ఎదిగిన 41 ఏళ్ల జేర్డ్‌కు రెండు సార్లు అంతరిక్షంలోకి వెళ్లిన అనుభవం ఉంది. అంతరిక్షంలో స్పేస్‌వాక్ చేసిన తొలి ప్రైవేట్ వ్యోమగామిగా గుర్తింపుపొందారు.
పైలట్, వ్యోమగామి అయిన జేర్డ్‌ను నాసా అడ్మినిస్ట్రేటర్‌గా నామినేట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని ట్రంప్ అన్నారు. ప్రస్తుతం ‘షిఫ్ట్4 పేమెంట్స్’ కంపెనీ సీఈవోగా ఉన్న జేర్డ్ తన 16వ ఏటలోనే ఈ కంపెనీని ప్రారంభించారు. 1983 ఫిబ్రవరి 11న న్యూజెర్సీలో జన్మించిన జేర్డ్ ఐజాక్‌మన్ 16వ ఏట హైస్కూలు చదువు మానేశారు.
LignoSat: ప్రపంచంలో తొలిసారి.. నింగిలోకి దూసుకెళ్లిన కలప ఉపగ్రహం
‘నాసా చీఫ్‌గా పనిచేయడానికి అధ్యక్షుడు ట్రంప్ నామినేషన్‌ను స్వీకరించడం నాకు గౌరవంగా ఉంది. రెండో అంతరిక్ష యుగం ఇప్పుడే మొదలైంది. నాసా బృందంతో కలిసి పనిచేయడం జీవితకాల గౌరవం’ అని జేర్డ్ అన్నారు.