Skip to main content

Join Free Online Courses: ఉచితంగా రెండు వేల కోర్సులు.. ఈ వయసు గలవారు అర్హులు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘ఎడెక్స్‌’ (ఈడీఈఎక్స్‌) కార్యక్రమాన్ని ఆరంభించడం ద్వారా ఉన్నత విద్యను అందరికీ అందుబాటులో ఉంచే దిశగా ఒక కీలక అడుగు వేసింది.
Free Education   EdX Courses For Andhra Pradesh Students    EDEX Programme   Educational Opportunity

ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో ఈ కార్య క్రమం ద్వారా లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, హార్వర్డ్, ఎమ్‌ఐటీ, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్‌  వంటి ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల నుంచి రెండు వేల కోర్సులు ఉచితంగా అందించబడుతున్నాయి. ఇది నిజానికి రాష్ట్రంలోని యువతకు ఇస్తున్న గొప్ప పెట్టుబడి. ఇది భారత రాజ్యాంగం, మానవ హక్కుల చట్టాలు ప్రోత్సాహించే విద్యా హక్కును మరింత బలోపేతం చేస్తుంది.
 
భారతీయ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21ఏ ప్రకారం, 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచితంగా, నిర్బంధంగా విద్యను అందించాలి. అంతర్జాతీయ కోర్సులను కలిగిన ఉన్నత విద్యను అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా, ఏపీ ప్రభుత్వం నాణ్యమైన విద్య కేవలం కొన్ని వర్గాలకు పరిమితం కాకుండా ‘సమాన విద్యా హక్కు’ను గుర్తించింది. మానవ హక్కుల ప్రకటనలోని 26వ ఆర్టికల్‌ పేర్కొంటున్న ‘ప్రతి ఒక్కరికీ విద్య హక్కూ, అర్హత ఆధారంగా ఉన్నత విద్య అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి’ అన్న అంశాన్ని ఏపీ ప్రభుత్వం కార్యరూపంలోకి తెచ్చినట్లయింది.

EDX E-Learning: విద్యలో వండర్.. ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ సంస్థ ‘ఎడెక్స్‌’తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

‘ఎడెక్స్‌’ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన వారికి ప్రపంచ స్థాయి విద్యా సంస్థలలో ఉన్నత విద్యను అభ్యసించే కలను నిజం చేస్తుంది. సామాజిక, సాంస్కృతిక శాస్త్రాల నుండి శాస్త్ర, సాంకే తిక రంగాల వరకు వివిధ విషయాలలో ఉచిత కోర్సు లను అందించడం ద్వారా ఈ కార్యక్రమం కేవలం విద్యా పరిధిని విస్తరించడమే కాకుండా, విభిన్న నైపుణ్యాలను కలిగి ఉన్న ప్రపంచ స్థాయి కార్మిక శక్తిని సిద్ధం చేస్తుంది.

అంతర్జాతీయ సంస్థలలో ఉన్నత విద్య అందించే ‘ఎడెక్స్‌’ ప్రోగ్రామ్‌ మూలంగా యువత తమ ప్రతిభను ప్రపంచ వేదికపై ప్రదర్శించే అవకాశాలను పొందు తుంది. విద్యా రంగంలో ఈ రకమైన ప్రగతి కారక అడుగులు, సమాజంలో ఆర్థిక, సామాజిక సమా నత్వాన్ని సాధించడానికి తప్పనిసరిగా దోహద పడతాయి. విద్యార్జన వంటి మౌలిక హక్కును అందరికీ అందించడం వల్ల వ్యక్తులు తమ సామర్థ్యాలను గుర్తించి, వాటిని పరిపూర్ణంగా వాడుకోవడానికి వీలవుతుంది.

ఇది వారికి ఉత్తమ ఉద్యోగ అవకాశాలను అందించడమే కాకుండా, వారి కుటుంబాలు, సమా జాలలో ఆర్థిక స్థితిని మెరుగు పరచడంలో కూడా సహాయపడుతుంది. విద్య ద్వారా సాధించే ఈ పరివర్తన నిరంతరం కొనసాగాలి. అందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు.. వెరసి సమాజం మొత్తం సహకరించాలి. ఈ సమన్వయం ద్వారానే, మనం ఒక సంక్షేమ సమాజం నిర్మాణంలో పాల్గొనగలం.

చివరగా, ‘ఎడెక్స్‌’ పథకం వంటి సంకల్పాలు సామాజిక న్యాయం, సమానత్వం అనే భారతీయ రాజ్యాంగ ఆదర్శాలను బల పరుస్తూ, ప్రతి విద్యార్థికీ విద్యా అవకాశాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది సమాజంలో ఆర్థిక, సాంస్కృతిక వైవిధ్యాలను గౌరవిస్తూ, అన్ని వర్గాల నుండి వచ్చిన విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలను కల్పించి, వారిలో సమాజం పట్ల బాధ్యత ప్రపంచ సమస్యలపై స్పందించే సామర్థ్యం నెలకొల్పు తుంది. ‘ఎడెక్స్‌’ వంటి పథకాలు కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా, ఉపాధ్యాయులు, విద్యా సంస్థలు, ప్రభుత్వంలోని ఇతర భాగాలకు కూడా లాభ దాయకం. వీటి ద్వారా, విద్యా రంగంలో సమగ్రత, నవీనీకరణ, సామర్థ్యపూర్వక ప్రగతి సాధించడం సాధ్య మవుతుంది. 

Higher Education: అంతర్జాతీయ వర్సిటీల సర్టిఫికేషన్‌ కోర్సులు.. 12 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం!!

Published date : 24 Feb 2024 12:24PM

Photo Stories