MBA Pharma Course : ఫార్మా ఎంబీఏతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కొలువులు ఇలా..!
అదేవిధంగా ఫార్మసీ రంగం జాతీయంగా ఇంక అంతర్జాతీయంగా దినదిన అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఫార్మ, మేనేజ్మెంట్ రంగంలో నైపుణ్యత కలిగిన వారి అవసరం కంపెనీలకు ఎంతైనా ఉంది. అందువల్ల ఫార్మ ఎంబీఏ ని మనము ఒక మంచి కెరియర్ మార్గంగా ఎంచుకోవచ్చు.
Manu Bhaker: 124 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మనూ భాకర్.. ఒకే ఒలింపిక్స్‌లో రెండో పతకాలు..
అయితే, ఈ వ్యాసంలో మనం అసలు ఫార్మా ఎంబీఏ అంటే ఏమిటి? దానిని చదవడానికి కావలసిన అర్హతలు ఏమిటి చదువు పూర్తి చేసిన తర్వాత ఎటువంటి కొలువులు సాధించవచ్చు.. అనే విషయాలు పూర్తిగా మనం తెలుసుకుందాం..
అసలు ఫార్మా ఎంబీఏ అంటే ఏమిటి?
బీ ఫార్మసీలో వివిధ రసాయనాలు, ఔషధార తయారీ గురించి వివరిస్తారు. అయితే, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసిన వారికి ఫార్మసీ రంగం పట్ల మాత్రమే పట్టు ఉంటుంది. అయితే, అదే క్రమంలో వారికి మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వంటి అంశాలపై అవగాహన తక్కువగా ఉంటుంది. అయితే, ఎంబీఏ ఫార్మటికల్స్ సైన్సెస్ ఆ గ్యాప్ ని తొలగించి విద్యార్థులు ఫార్మసీ మరి మేనేజ్మెంట్ రంగాలలో శిక్షణ ఇవ్వడం ద్వారా కంపెనీల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేయడానికి సహాయపడుతుంది. తద్వారా ఫార్మా ఎంబీఏ చదివిన విద్యార్థులు ఫార్మసీ అండ్ మేనేజ్మెంట్ రంగాలలో నైపుణ్యతను కలిగి ఉంటారు.
Rajender Kommu: అరుదైన అవకాశం.. ఒలింపిక్స్‌లో న్యాయనిర్ణేతగా వరంగల్ బిడ్డ!
ఫార్మా ఎంబీఏ ను ఎవరు చేయవచ్చు..!
సాధారణంగా, ఫార్మా ఎంబీఏ ని బి ఫార్మసీ తర్వాత రెండు సంవత్సరాల కోర్స్‌గా నిర్ణయించారు. అందువల్ల ఫార్మా ఎంబీఏ కోర్సు చేయడానికి కనీస అర్హత బిఫార్మసీ లేదా లైఫ్ సైన్సెస్ లో డిగ్రీ అర్హతగా కలిగి ఉండాలి. అయితే, కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్‌ని అర్హతగా తీసుకొని బీ ఫార్మసీ ప్లస్ ఫార్మా ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లోకి ప్రవేశం ఇస్తున్నారు. ఈ కోర్సు కాల వ్యవధి ఐదు సంవత్సరాలు ఉంటుంది. తర్వాత బీ ఫార్మసీ అండ్ ఫార్మ ఎంబీఏ రెండు డిగ్రీల ఇస్తారు. తద్వారా విద్యార్థులు ఒక సంవత్సరాన్ని ఆదా చేసుకుంటారు.
సీటు సాధించడం ఎలా?
బీ ఫార్మసీ తర్వాత జి పాట్ పరీక్షలో అర్హత, నైపర్ పరీక్షలో అర్హత సాధించడం ద్వారా ఫార్మా ఎంబీఏ లో సీటు సాధించవచ్చు. అయితే, 2024 సంవత్సరం నుంచి కేవలం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ మొహాలీలో మాత్రమే ఎంబీఏ కోర్స్ అందుబాటులో ఉంటుంది. దీనికోసం మనం అప్లికేషన్ నింపేటప్పుడు ఫార్మ ఎంబీఏని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా, నేపర్లలో ఎంఫార్మసీ కోర్సు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపకార వేతనం అందుతుంది. అయితే ఫార్మా ఎంబీఏ విద్యార్థులకు ఎటువంటి ఉపకార వేతనం లభించదన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అదే విధంగా వివిధ ప్రైవేట్ యూనివర్సిటీలో సీటు సాధించడానికి ఆ యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
కాల వ్యవధి, బోధన తదితర వివరాలు..
ఫార్మా ఎంబీఏ కోర్స్ ని రెండు సంవత్సరాలు నాలుగు సెమిస్టర్లుగా విభజించారు. అందులో ముఖ్యమైన సబ్జక్ట్స్ ఫార్మసిటికల్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఫార్మసిటికల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ ఎనాలసిస్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఫార్మా డిస్ట్రిబ్యూషన్, వంటి అంశాలు బోధిస్తారు. అదే విధంగా ఫార్మా ఎంబీఏ చదువుతూ ఉండగానే వివిధ ఫార్మా కంపెనీలలో ఇంటర్న్ షిప్ సాధించడంతో విద్యార్థులు చదువు పూర్తి అవ్వకముందే వృత్తిరీత్యా నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం లభిస్తుంది.
ఉపాధి అవకాశాలు..
ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలు జాతీయంగా మరి అంతర్జాతీయంగా కూడా త్వరితగతిన వృద్ధి చెందుతున్న క్రమంలో ఫార్మ ఎంబీఏ చేసిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే వారి అర్హతలను బట్టి వివిధ స్థాయిలో వివిధ వేతనాలతో కొలువుల లభిస్తూ ఉంటాయి. ఉదాహరణకు
1. ఫార్మసిటికల్ ప్రోడక్ట్ మేనేజర్
2. ఫార్మసిటికల్ సిటికల్ పర్చేజ్ మేనేజర్
3. డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజర్
4. రెగ్యులేటరీ ఎఫైర్స్ మేనేజర్
5. క్లినికల్ రీసెర్చ్ మేనేజర్
6. ఫార్మసిటికల్ సేల్స్ మేనేజర్
7. బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్
8. హెల్త్ కేర్ కన్సల్టెంట్ మేనేజ్మెంట్... వంటి హోదాలలో వివిధ జాతీయ, బహుళ జాతీయ కంపెనీలలో మంచి వార్షిక వేతనంతో ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది.
Authored by
Penumala Prudhvi
M.S Pharma Assistant Professor, Department of Pharmacology, NMIMS
Tags
- MBA Pharma Course
- Medical courses
- employment offers
- B Pharmacy
- medical jobs
- NMIMS professor
- M Pharmacy Course
- medicine courses
- MBA Pharma Entrance exam
- Chemicals and pharmaceuticals
- higher education
- Students
- Medical students
- Pharmacy Courses
- pharma mba colleges
- GPAT exam
- NIPER Exam
- eligible candidates for mba pharma
- Education News
- Sakshi Education News
- PharmaMBA
- PharmaceuticalMBA
- CareerOpportunities
- PharmaMBADetails
- PharmaMBAQualifications
- sakshieducationlatest news