Skip to main content

Schools and Colleges Dasara & Sankranti Festivals Holidays 2024 : ఈ సారి భారీగా స్కూల్స్‌, కాలేజీల‌కు దసరా, సంక్రాంతి సెల‌వులు ప్రకటించిన ప్రభుత్వం.. మొత్తం ఎన్ని రోజులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ ఏడాది స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగా పండ‌గ సెల‌వులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్దపండుగలో దసరా, సంక్రాంతిలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు పండ‌గ‌ల‌కు ప్ర‌భుత్వం సెల‌వులు భారీ ఇవ్వ‌నున్నారు.
Schools and Colleges Dasara & Sankranti Festivals Holidays 2024  Dussehra and Sankranti holidays in AP Academic Calendar  AP schools and colleges festive holidays announcement  Nara Lokesh announces festive holidays for schools and colleges  AP Academic Calendar announcement by Nara Lokesh  AP Education Minister Nara Lokesh releasing AP Academic Calendar

ఈ పండుగలను తెలుగు ప్రజలు అంగరంగవైభవంగా చేసుకుంటారు. ఈ క్రమంలోనే 2024-25 విద్యా సంవత్సరంలో కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్ని సూళ్లకు ప్రభుత్వం పండుగ సెలవులను ప్రకటించింది. ఈ మేర‌కు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జూలై 29వ తేదీన (సోమవారం) ఏపీ అకడమిక్ క్యాలెండర్‌ణు విడుదల చేశారు. 

దసరా, సంక్రాంతి పండ‌గ‌ల‌కు భారీగా..
ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్లు 232 రోజులు పని చేయనున్నాయి. మొత్తం 83 రోజులు సెలవులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రైమరీ, హై స్కూళ్లకు దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మొత్తం 10 రోజులు సెలవులు ప్రకటించారు. అలాగే సంక్రాంతి పండ‌గ‌కు జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు స్కూల్స్‌కు సెల‌వులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. అంటే మొత్తం 9 రోజులు పాటు స్కూల్స్‌కు సంక్రాంతి సెల‌వులు ప్ర‌క‌టించారు.

2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే..

➤☛ దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి.
➤☛ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➤☛ అక్టోబరు 31న దీపావళి సెలవు
➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు.

Published date : 30 Jul 2024 01:21PM

Tags

Photo Stories