Skip to main content

Rajender Kommu: అరుదైన అవకాశం.. ఒలింపిక్స్‌లో న్యాయనిర్ణేతగా వరంగల్‌ బిడ్డ!

అత్యంత ప్రతిష్టాత్మకంగా పారిస్‌లో జరగనున్న 33వ పారా ఒలింపిక్స్‌ క్రీడా సమరంలో న్యాయనిర్ణేతగా వ్యవహరించే అరుదైన అవకాశం ఉమ్మడి వరంగల్‌ బిడ్డకు దక్కింది.
Telangana Man Rajendar Kommu Named Badminton World Federation Line Judge In Paris Olympics

షటిల్‌ బ్యాడ్మింటన్‌ టెక్నికల్‌ అఫీషియల్‌గా భారతదేశం నుంచి ఇద్దరికి అవకాశం రాగా.. అందులో ఈ వరంగల్‌ వ్యక్తి ఒకరు.

ఆగస్టులో ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (మలేషియా) పారా ఒలింపిక్స్‌లో న్యాయ నిర్ణేతలుగా పాల్గొనేందుకు భారత్‌ నుంచి పూణేకు చెందిన ఒకరిని నియమించగా.. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నెక్కొండకు చెందిన ఫిజికల్‌ డైరెక్టర్‌ కొమ్ము రాజేందర్‌కు అవకాశం కల్పిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి దశ ఒలింపిక్స్‌ కొనసాగుతుండగానే.. రెండో దశలో ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు పారిస్‌ వేదికగా పారా ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్నాయి.

టెక్నికల్‌ అఫీషియల్స్‌గా..
ఈ ఒలింపిక్స్‌లో కొమ్ము రాజేందర్‌ టెక్నికల్‌ అఫీషియల్స్‌గా వ్యవహరించనున్నారు. భారత్‌ నుంచి తనకు అందిన ఈ అవకాశాన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నానని ఫిజికల్‌ డైరెక్టర్‌ కొమ్ము రాజేందర్ అన్నారు.

Paris Olympics: ఒలింపిక్స్‌లో పాల్గొనే హైదరాబాద్‌ అమ్మాయిలు వీరే..

గురువుల ప్రోత్సాహంతోనే..
'పాఠశాల స్థాయిలో ఆటల్లో నా ప్రతిభను గుర్తించి నాటి నుంచి ఒలింపిక్స్‌లో టెక్నికల్‌ అఫీషియల్‌గా ఎంపికవడం వరకు అడుగడుగునా గురువులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. క్రీడా గురువులు రాజశేఖర్‌, చెన్న కృష్ణ, సాంబయ్య, నిమ్మ మోహన్‌రావు, పి.కుమారస్వామి ఆట నేర్పిస్తే, అంపైర్‌గా రాణించేలా షటిల్‌ బ్యాడ్మింటన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ ఎస్‌.రమేశ్‌కుమార్‌, డాక్టర్‌ పి.రమేశ్‌రెడ్డి, రాష్ట్రస్థాయిలో కేసీహెచ్‌ పున్నయ్య చౌదరి, సుధాకర్‌ వేమూరి భుజం తట్టారు.' ఒలింపిక్స్‌ టెక్నికల్‌ అఫీషియల్‌ కొమ్ము రాజేందర్ అన్నారు.

Paris Olympics: పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే ఏపీ క్రీడాకారులు వీరే..

Published date : 30 Jul 2024 03:14PM

Photo Stories