Manu Bhaker: 124 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మనూ భాకర్.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు..
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ రెండో పతకం కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ షూటింగ్‌లో కాంస్యం దక్కించుకుంది. భారత షూటింగ్ జోడీ మనూ భాకర్-సరబ్‌జోత్ సింగ్ అద్భుత ప్రదర్శనతో దేశానికి ఒలింపిక్ మెడల్ అందించారు. జూలై 30వ తేదీ దక్షిణ కొరియా జోడీ(వాన్ హోలీ, జిన్ ఎ వాహిమ్)ని 16-10తో ఓడించి పతకం సాధించారు.
ఒలింపిక్స్‌లో మనూ భాకర్..
10 మీటర్ల ఎయిర్ పిస్టల్: ఈ ఈవెంట్‌లో కాంస్య పతకం గెలుపొంది భారత్‌కు తొలి పతకాన్ని అందించింది.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్: సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మరో కాంస్య పతకాన్ని సాధించింది.
124 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి..
మనూ భాకర్ ఒకే ఒలింపిక్స్ ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళ. ఇది మాత్రమే కాకుండా, ఈ ఘనత సాధించిన తొలి 'ప్యూర్ ఇండియన్' అథ్లెట్‌గా కూడా నిలిచింది. ఇంతకు ముందు ఈ రికార్డు 1900 ఒలింపిక్స్‌లో బ్రిటిష్-ఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిచార్డ్ పేరిట ఉంది. ఈయన 200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హార్డిల్స్‌లో రజతాలు సాధించాడు. ఈ క్రమంలో భారత్ తరఫున 124 ఏళ్ల తర్వాత హరియాణా అమ్మాయి మనూ భాకర్ ఈ రికార్డు బద్దలు కొట్టింది.