Skip to main content

Students Appreciation : ప‌ది, ఇంట‌ర్ విద్యార్థుల‌ ప్ర‌తిభ‌కు ప్రోత్సాహ‌కాలు లేన‌ట్టేనా..!

No appreciation session for ap tenth and inter students

బేస్తవారిపేట: ప్రతి పేద, మధ్య తరగతి విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాడు–నేడు పథకం కింద పాఠశాలల రూపు రేఖలను మార్చేసింది. అంతే కాకుండా ప్రభుత్వ బడుల్లో చదువుకుని పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు జగనన్న ఆణిముత్యాలు పేరిట నగదు ప్రోత్సాహక బహుమతులు అందించి సత్కరించింది. అయితే ప్రస్తుతం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో గత విద్యా సంవత్సరం (2023–24)లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు లేనట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వివిధ స్థాయిల్లో ప్రోత్సాహకాలు:

ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫలితాలను మెరుగు పరచి వారిని ప్రోత్సహించేలా గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ప్రోత్సాహక బహుమతులు అందించారు. పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల వారీగా ఎంపిక చేసి నగదు బహుమతులు అందించారు. పదో తరగతితో పాటు ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీ వంటి గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించిన వారిని ఎంపిక చేసి ప్రోత్సాహకాలు అందించారు.

Internal Trade: గడిచిన ఐదేళ్లలో ఏపీలోకి రూ.7,371 కోట్ల విదేశీ పెట్టుబడులు

పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించిన వారికి రూ.లక్ష, రెండో స్థానానికి రూ.75 వేలు, మూడో స్థానానికి రూ.50 వేలు అందించారు. ఇంటర్మీడియెట్‌లో గ్రూపునకు ఒక్కరు చొప్పున ప్రతిభ చాటిన వారికి రూ.లక్ష అందించారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.50 వేలు, రెండో స్థానానికి రూ.30 వేలు, మూడో స్థానానికి రూ.15 వేలు అందించారు. ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు గ్రూపునకు ఒక్కరు చొప్పున ప్రతిభ చాటిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేలు అందించి ప్రోత్సహించారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో పదో తరగతిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు, ఇంటర్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థులకు రూ.15 వేలు ప్రోత్సాహకంగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అందించింది. పాఠశాల స్థాయిలో మొదటి ముగ్గురు టాపర్స్‌గా నిలిచిన వారికి వరుసగా రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.1000 అందించారు.

ఈ ఏడాది ప్రోత్సాహకాలు లేనట్టే..

ప్రస్తుతం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడానికి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం ప్రోత్సాహక బహుమతులు లేనట్టేనని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రోత్సాహక బహుమతులు అందిస్తే విద్యార్థులను ప్రోత్సహించడమే కాకుండా వారిలో మనోధైర్యం కల్పించిన వారవుతారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Junior College Lecturers : జూనియ‌ర్ క‌ళాశాలలోని కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయుల‌ను ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం.. రెన్యూవ‌ల్ ఎప్పుడు!

2022–23లో జిల్లా స్థాయిలో 27 మంది, నియోజకవర్గ స్థాయిలో 42 మంది, పాఠశాల స్థాయిలో 600 మంది విద్యార్థులు ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. కూటమి ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు పెంచి పదో తరగతి, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

పది, ఇంటర్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించిన జగన్‌ సర్కార్‌ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో బహుమతులు ఈ ఏడాది ఇంతవరకూ విడుదల కాని మార్గదర్శకాలు కూటమి ప్రభుత్వం పథకం అమలు చేస్తుందా..లేదా అన్న సందేహాలు

Jobs: మోడల్‌ స్కూళ్లలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Published date : 30 Jul 2024 09:33AM

Photo Stories