Junior College Lecturers : జూనియర్ కళాశాలలోని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను పట్టించుకోని ప్రభుత్వం.. రెన్యూవల్ ఎప్పుడు!
కర్నూలు సిటీ: జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను టీడీపీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 2023–24 విద్యా సంవత్సరం కాలపరిమితి ఏప్రిల్ నాటికి పూర్తయింది. 2024–25కి సంబంధించి రెన్యూవల్ చేయాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం రెన్యూవల్ గురించి ఆలోచించడం లేదు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత ఉండటం, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందకపోవడంతో విద్యార్థి, ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో కాంట్రాక్టు అధ్యాపకులను నియమించారు.
Jobs: మోడల్ స్కూళ్లలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
అప్పటి నుంచి ప్రతి ఏటా వారి సర్వీసుల రెన్యూవల్ చేస్తున్నారు. జిల్లాలో 23 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 173 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పని చేస్తున్నారు. ఈ ఏడాది మేలో ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. తర్వాత ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల విధులు, ఆ తర్వాత ఆన్‌లైన్ మూల్యాంకనం విధులూ చేపట్టారు. 2024–25 సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల అడ్మిషన్ల డ్రైవ్ కూడా నిర్వహించారు. జూన్ 1 నుంచి కళాశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఆ రోజు నుంచి కళాశాలల్లో తరగతులు బోధిస్తున్నారు. మే, జూన్ రెండు నెలలూ పూర్తిగా పని చేశారు.
School Re Union : 75 ఏళ్ల వయసులో పాఠశాల స్నేహితులతో సందడి.. తిరిగి బాల్యంలోకి..
కానీ ఇప్పటిదాకా జీతాలు మంజూరు చేయలేదు. 2019 జనవరిలో అప్పటి సీఎం చంద్రబాబు కాంట్రాక్ట్ లెక్చరర్లకు రూ.27 వేల నుంచి రూ.37,100కు వేతనం పెంచారు. అయితే ఏప్రిల్ నుంచి అమలయ్యేలా జీఓ ఇచ్చారు. తర్వాత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే జీతాల పెంపు జీఓను అమలు చేశారు. మూడేళ్ల క్రితం పీఆర్సీ ఇచ్చిన సమయంలో ఏకంగా రూ.57,100 వేతనం చేశారు. దీంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోలకు కాంట్రాక్ట్ లెక్చరర్లు క్షీరాభిషేకాలు చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్లందరూ జగన్‌కు మద్దతుగా ఉన్నారనే కారణంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్ట్ గడువు ముగిసినా రెన్యూవల్ చేయడంలో జాప్యం చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.