Skip to main content

Anganwadi news: అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు బ్యాడ్‌న్యూస్‌...

Anganwadi news   salary issues in anganwadi teachers.
Anganwadi news

సాక్షి, హైదరాబాద్‌రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లకు వేతన కష్టాలు తీరడం లేదు. ప్రస్తుతం రెండు నెలల నుంచి వారికి వేతనాల్లేవు.

మరోవైపు సమ్మె కాలానికి సంబంధించిన బకాయిలు సైతం ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదు. దీంతో అంగన్‌వాడీ టీచ ర్లు, హెల్పర్లు క్షేత్రస్థాయిలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా పదో తేదీలోపు అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు అందేవి.

కానీ ఏడాది కాలంగా ఈ చెల్లింపుల ప్రక్రియ గాడితప్పింది. రెండు, మూడు నెలలకోసారి వేతనాలు విడుదల కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Free training in tailoring: టైలరింగ్‌, బ్యూటీ పార్లర్‌లో ఉచిత శిక్షణ

రాష్ట్రంలో 59వేల మంది అంగన్‌వాడీ సిబ్బంది 
రాష్ట్రంలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి ఒక టీచర్, ఒక హెల్పర్‌ చొప్పున పోస్టులు మంజూరైనప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా 59వేల మంది టీచర్లు, హెల్పర్లు ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్నారు. అంగన్‌వాడీ టీచర్‌కు నెలకు రూ.13650 చొప్పున గౌరవ వేతనం ఇస్తుండగా... హెల్పర్‌కు రూ.7800 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం గౌరవవేతనం మంజూరు చేస్తోంది. 

ప్రతి నెలా జాప్యమే.. 
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన చెల్లింపుల్లో ప్రతి నెలా జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. సాంకేతిక సమస్యలో లేక ఇతరత్రా కారణాలతో వేతన చెల్లింపుల్లో కాస్త ఆలస్యం కావడం సహజమే అయినప్పటికీ.. ప్రతి నెలా ఇదే పరిస్థితి తలెత్తుతుండడం పట్ల వారు తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ వేతనంపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించే పరిస్థితుల్లో వేతన చెల్లింపుల జాప్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

వేతనాలకు ప్రతి నెలా రూ.70 కోట్లు 
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల గౌరవవేతనానికి సంబంధించి ప్రతి నెలా సగటున రూ.70కోట్ల బడ్జెట్‌ అవసరం. ఈ లెక్కన ఏటా రూ.840 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది. గత కొంత కాలంగా కేంద్రం నుంచి వచ్చే నిధుల రాక ఆలస్యం కావడంతో ఈ జాప్యం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. బడ్జెట్‌ సమస్యతో వేతన చెల్లింపులు ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. 

కమిషనరేట్‌కు ఫిర్యాదులు 
వేతన చెల్లింపుల్లో జాప్యంపై అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల నుంచి రాష్ట్రస్థాయి ఉ న్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ అంగన్‌వాడీ టీచర్లు, హె ల్పర్ల సంఘం ఇటీవల రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌కు వే ర్వేరుగా వినతి పత్రాలు సమరి్పంచింది. వేత న చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరి ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని కోరింది. 

Published date : 18 Jun 2024 08:11AM

Photo Stories