Skip to main content

Cement Corporation of India Limited jobs: డిగ్రీ అర్హతతో సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు జీతం నెలకు 40000

Cement Corporation of India Limited  BECIL recruitment notification  BECIL job vacancies announcement  Ministry of Information and Broadcasting job opportunities  BECIL recruitment 2024 details  Apply online for BECIL vacancies
Cement Corporation of India Limited

భారత ప్రభుత్వం , ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్  మినిస్ట్రీ పరిదిలో గల మినిరత్న కంపెనీ అయినటువంటి బ్రాడ్ కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

డిగ్రీ అర్హతతో SBIలో 600 ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాలు జీతం నెలకు 48480: Click Here

ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , రాజ్బన్ సిమెంట్ ఫ్యాక్టరీ (హిమాచల్ ప్రదేశ్) సంస్థ కార్యాలయంలో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా బర్నర్ , ఫిట్టర్ , ఎలక్ట్రీషియన్ , ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అను ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ: బ్రాడ్ కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
బర్నర్ – 01
ఫిట్టర్ – 02 
ఎలక్ట్రీషియన్ – 01
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ – 01 అనే ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విద్యార్హత:
1. బర్నర్ : కెమిస్ట్రీ సబ్జెక్టు గా కలిగిన బి. ఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత లేదా కెమికల్ ఇంజనీరింగ్ / సిమెంట్ టెక్నాలజీ లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి వుండాలి.
సిమెంట్ ఇండస్ట్రీ లో  ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం అవసరం అగును.
2. ఫిట్టర్ : ఐటిఐ ( ఫిట్టర్ ) ఉత్తీర్ణత
3. ఎలక్ట్రీషియన్ : ఐటిఐ ( ఎలక్ట్రీషియన్ ) ఉత్తీర్ణత 
4. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ : ఐటిఐ (ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఉత్తీర్ణత ) 

వయస్సు:
బర్నర్ ఉద్యోగాలకు 40 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫిట్టర్ ,  ఎలక్ట్రీషియన్ ,  ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నిండి యుండి 35 సంవత్సరాలలోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ తో పాటు గా క్రింద పేర్కొన్న కాపీలు కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా పంపించాలి.

అవసరమగు పత్రాలు: 
విద్యార్హత ధృవ పత్రాలు
SSC లేదా బర్త్ సర్టిఫికెట్
కుల ధృవీకరణ పత్రం
పని అనుభవం వున్న వారు వర్క్ ఎక్సపీరియన్స్ దృవీకరణ పత్రం
పాన్ కార్డు
ఆధార్ కార్డు
పేర్కొన్న ధృవ పత్రాలు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి , దరఖాస్తు తో జత చేసి ఆఫీస్ వారి చిరునామా కి పంపించాలి.

దరఖాస్తు పంపవలసిన చిరునామా: Broadcast Engineering Consultants India Limited (BECIL), BECIL BHAWAN, C-56/A-17, Sector-62, Noida-201307 (U.P).

అప్లికేషన్ ఫీజు:  
జనరల్ /  ఓబీసీ/ ఎక్స్ – సర్వీస్ మాన్ / మహిళలు – 590/- రూపాయలు.
ఎస్సీ , ఎస్టీ, PwBD, EWS అభ్యర్థులు 295/- రూపాయలు దరఖాస్తు ఫీజు ను ఆఫ్లైన్ విధానం ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో “Broadcast Engineering Consultants India Ltd, Noida”  పేరు మీదుగా చెల్లించాలి.

జీతం: 
బర్నర్ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకు 40,000/- రూపాయల జీతం లభిస్తుంది.
ఫిట్టర్ , ఎలక్ట్రీషియన్ , ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఉద్యోగాలు కు  ఎంపిక కాబడిన వారికి  12,360/- రూపాయల జీతం లభిస్తుంది.

ముఖ్యమైన తేదిలు: Offline విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 08/01/2025

 

Click Here For Notification and Application

Click Here for official website

Published date : 31 Dec 2024 08:36AM

Photo Stories