Skip to main content

Exams Week : న్యూ ఇయ‌ర్‌లో తొలి వార‌మే ఈ ప‌రీక్షలు..

నేడు 2025 నూత‌న సంవ‌త్స‌రానికి అడుగు పెడింది. అయితే ఈ కొత్త ఏడాదిలో విద్యార్థుల‌కు, ఉద్యోగార్థుల‌కు ప‌రీక్ష‌ల వారంగా మారింది.
Exams for students and unemployees at first week of 2025

సాక్షి ఎడ్యుకేష‌న్: నేడు 2025 నూత‌న సంవ‌త్స‌రానికి అడుగు పెడింది. అయితే ఈ కొత్త ఏడాదిలో విద్యార్థుల‌కు, ఉద్యోగార్థుల‌కు ప‌రీక్ష‌ల వారంగా మారింది. వీరికి కోన్ని పరీక్షలు జనవరి మొదటి వారం నుంచే ప్రారంభంకానున్నాయి. అందులో  యూజీసీ నెట్‌తో మొదలుకొని జేఈఈ మెయిన్‌ వరకూ పలు పరీక్షలు ఈ మాసంలోనే నిర్వ‌హించ‌నున్నారు. నూత‌న సంవ‌త్స‌రంలోని తొలి వారంలో ప‌రీక్ష‌లు ఇలా..

సీబీఎస్‌ఈ ప్రాక్టికల్ పరీక్షలు

ఈ సంవత్సరం ప్రారంభంలోనే సీబీఎస్‌ఈ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు మొదలుకానున్నాయి. బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, సీబీఎస్‌ఈ బోర్డు రెగ్యులర్ సెషన్ పాఠశాలలకు 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు 2025, జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి 14 మధ్య జరగనున్నాయి.

Engineering PG Courses: ఓయూ ఇంజినీరింగ్ పీజీ కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు

యూజీసీ నెట్‌ పరీక్ష

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డిసెంబర్ 2024 సెషన్ కోసం యూజీసీ నెట్‌ పరీక్షను 2025, జనవరి 3, నుండి జనవరి 16 వరకు నిర్వహించనుంది. ఈ పరీక్ష 85 సబ్జెక్టులలో కొనసాగుతుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యూపీ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు

యూపీ బోర్డు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 23 నుండి ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్ పరీక్ష జనవరి 23 నుంచి 31 వరకు, ఫిబ్రవరి 1 నుంచి 8 వరకు రెండు దశల్లో నిర్వహించనున్నారు.

B Ed Admissions Counselling : డా.బీఆర్ అంబేడ్క‌ర్ వ‌ర్సిటీలో బీఈడీ కోర్సులు.. ఈ తేదీల్లోనే కౌన్సెలింగ్‌..

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్-2 పరీక్ష

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్‌)టైర్-2 పరీక్షను 2025, జనవరి 18, 19,20 తేదీలలో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా గ్రూప్ బీ, సీ మొత్తం 17,727 పోస్టులను భర్తీ చేయనున్నారు. టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే టైర్-2కు హాజరుకాగలుగుతారు. మరింత సమాచారం కోసం ssc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

యూకేసీఎస్‌సీ ఎస్‌ఐ పరీక్ష

ఉత్తరాఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ (యూకేసీఎస్‌సీ ఎస్‌ఐ) పోస్టుల రిక్రూట్‌మెంట్ పరీక్ష తేదీని ప్రకటించింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2025, జనవరి 12న నిర్వహిస్తున్నారు. ఆరోజు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష ఉండనుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను 2025, జనవరి 2 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 222 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

TET Exam Guidelines: టీజీ టెట్‌ పరీక్ష రాసే అభ్య‌ర్థుల‌కు ప‌లు సూచనలు.. సందేహాలకు ఈ నంబర్లని సంప్రదించొచ్చు..

యూపీఎస్‌సీ సీఎస్‌ఈ 2024 ఇంటర్వ్యూ

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) జనవరి 7 నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూ తేదీలు, ఇతర వివరాల కోసం యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inని సందర్శించవచ్చు.

జేఈఈ మెయిన్స్ పరీక్ష

ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ మొదటి సెషన్ 2025, జనవరి 22 నుండి జనవరి 31 వరకు జరుగుతుంది. అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు పరీక్షకు మూడు రోజుల ముందు జారీ చేస్తారు. అయితే పరీక్ష జరిగే ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే అందుబాటులో ఉంచనున్నారు. మరిన్ని వివరాల కోసం nta.ac.in ని సందర్శించవచ్చు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 01 Jan 2025 04:58PM

Photo Stories