Skip to main content

Talliki Vandanam Scheme : తల్లికి వందనం పథకానికి శఠగోపం.. ఇకపై రూ.15000/-

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూట‌మి ప్ర‌భుత్వ ముఖ్య‌మంత్రి చంద్రబాబు కేబినెట్‌ విద్యార్థుల తల్లులకు షాక్ ఇచ్చింది. తల్లికి వందనం పథకానికి కూటమి సర్కార్‌ మంగళం పాడేసింది.
Talliki Vandanam Scheme

వచ్చే ఏడాది ఆలోచిద్దామంటూ కేబినెట్‌ చేతులు దులుపుకుంది. ఈ ఏడాది తల్లికి వందనం లేనట్టేనని తేలిపోయింది.
అధికారంలోకి రాగానే పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రభుత్వం అమలు చేయలేదు. తల్లికి వందనం పథకం అమలపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో 80 లక్షల మందికి 15 వేలు చొప్పున తల్లికి వందనం ఇస్తామంటూ హామీ ఇవ్వగా, ఈ ఏడాది తల్లికి వందనం ఎగనామం పెట్టేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

➤ AP Job Calender 2025 Release Date : ఏపీ జాబ్ క్యాలెండర్ విడుద‌ల‌పై... ప్రభుత్వం కీలక ప్రకటన..? ఎక్కువ‌గా ఈ ఉద్యోగాలే...

ఒక్కొక్కటిగా ఎగ్గొట్టే పనిలో...
ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ ‘తల్లికి వందనం’ పథకం వర్తింపజేస్తామంటూ మంత్రి నారా లోకేష్‌ ఊదరగొట్టారు. తల్లులు, పిల్లల డేటా సిద్ధంగా ఉన్నా.. విధివిధానాల రూపకల్పనలో జాప్యం జరుగుతోందని చెబుతూ.. ఇప్పట్లో పథకం అమలు చేయబోమని శాసన మండలిలో కూడా ప్రశ్నోత్తరాల సమయంలో పరోక్షంగా చెప్పిన సంగతి తెలిసిందే. తల్లికి వందనం అమలుకు విధివిధానాలు రూపొందించడానికి కొంత సమయం కావాలని అడిగామని, దీనిపై మంత్రులందరితో చర్చిస్తు­న్నట్టు చెప్పారు. తాజాగా, కేబినెట్‌ కూడా చేతులెత్తేసింది. ఏపీలో కూటమి సర్కార్‌ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టే పనిని ప్రారంభించింది. అయితే, తాజాగా తల్లికి వందనం విషయంలోనూ పిల్లిమొగ్గలు వేస్తుందనే ప్రజల్లో చర్చ మొదలైంది.

Published date : 03 Jan 2025 10:27AM

Photo Stories