Scholarship Applications: ‘ఉపకార’ దరఖాస్తులు 62 శాతమే.. కారణం ఇదే..

ఈ ఏడాది సెప్టెంబర్‌తో మొదలైన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గడువు నేటితో ముగియ నున్నప్పటికీ కేవలం 62 శాతం మందే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఉపకార వేత నాలు, ఫీజు పథకాలకు సంబంధించి ఏటా సగటున 12.5 లక్షల దరఖాస్తులు వస్తుండగా 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 7.75 లక్షల మందే దరఖాస్తులు సమర్పించారు. వారిలో ఫ్రెషర్స్ 3.11 లక్షల మంది ఉండగా... రెన్యువల్ విద్యార్థులు 4.64 లక్షల మంది ఉన్నారు. మరోవైపు వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ రిజిస్ట్రేషన్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉందని సంక్షేమ శాఖలు నిర్ణయించాయి.
చదవండి: Govt Scholarships: ఈ పథకానికి ఎంపికైతే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 50వేలు..
అందుకు అనుగుణంగా గడువును మరో 3 నెలలు పొడిగించేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. అయితే ప్రభుత్వం కనీసం మరో నెలపాటు అవకాశం ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉంది.