IIT Madras: దేశంలోనే టాప్-1గా ఐఐటీ మద్రాస్..ఎందుకంత స్పెషల్? ప్లేస్‌మెంట్స్ కారణమా?
దేశంలోనే అత్తుత్యమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ తొలి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ విడుదల చేసిన ఈ జాబితాలో ఐఐటీ మద్రాస్ వరుసగా ఆరేళ్లుగా నెంబర్1 స్థానంలోనే కొనసాగుతూ రికార్డు సృష్టిస్తుంది. దీంతో ఈ ఐఐటీలో చేరేందుకు ఎంతోమంది స్టూడెంట్స్ ఆసక్తి చూపిస్తుంటారు.
దీంతో ఏఏ డిపార్ట్‌మెంట్స్,కోర్సులు అందుబాటులో ఉన్నాయి? క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఎలా ఉంటాయి? ఏ బ్రాంచ్‌ను ఎంచుకోవడం మంచిది? ఇలా క్యాంపస్ గురించి పలు రకాల సందేహాలు రావడం సహజమే. వీటన్నింటిని నివృత్తి చేసేందుకు ఐఐటీ మద్రాస్ పూర్త విద్యార్థులు ఒక సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. స్టూడెంట్స్‌కు మరింత చేరువ అయ్యేందుకు www.askiitm.com అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
ఈ వెబ్‌సైట్ ద్వారా ఐఐటీ మద్రాస్ గురించి సాధారణంగా విద్యార్థులు ఎదుర్కొనే అనేక సందేహాలకు వీడియోల రూపంలో సులువుగా అర్థమయ్యేలా సమాధానాలు అందించారు. అంతేకాకుండా ఈ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు తమ సందేహాలను అడిగితే, కేవలం కొన్ని గంటల్లోనే మీ డౌట్స్‌ను క్లియర్ చేస్తారు. ఇందుకోసం Ask a Question అనే విభాగంలో క్యాంపస్‌కు సంబంధించి ఎటువంటి ప్రశ్నలనైనా అడవగవచ్చు.
Tags
- IIT Madras
- nirf ranking 2024
- nirf ranking 2024 college
- NIRF 2024
- NIRF 2024 Rankings
- NIRF Ranks
- Union Ministry of Education
- Top Institutions
- Top Institutions in india
- top 10 nstitutions in india
- Top10 educational Institutions
- telugu news nirf ranking 2024 college
- IIIT Madras
- IIT Madras Notification
- IIT Madras new website launch