Department of Education: పాఠశాల ప్రొఫైల్ పూర్తి చేయాలి.. ప్రతీ విద్యార్థికి ఈ కార్డు తప్పనిసరి..
Sakshi Education
ఆదిలాబాద్ టౌన్: జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలలకు సంబంధించి ఆయా పాఠశాలల జనరల్, ఎన్‌రోల్‌మెంట్, ఫెసిలిటి ప్రొఫైళ్లను వెంటనే పూర్తి చేయాలని విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి జె.నారాయణ అన్నా రు.
ఈమేరకు ఎమ్మార్సీ, క్లస్టర్ రిసోర్స్ ప ర్సన్లతో జిల్లా కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో నవంబర్ 19న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పాఠశాల ప్రొఫైల్‌ను సమర్పించనట్లయితే పదో తరగతి విద్యార్థుల ఎన్‌ఆర్‌లు స్వీకరించబడవని పేర్కొన్నారు.
చదవండి: Adarsh: గుడ్ ఐడియా.. ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసి దానిపై బడికి
విషయాన్ని ప్రధానోపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. జిల్లాలోని ఆయా పాఠశాలల్లో చదువుతున్న ప్రతీ విద్యార్థికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఏ విద్యార్థికై నా లేనట్లయితే వారి వివరాలను డీఈవో కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ఫేస్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ వందశాతం జరగాలని, ప్రతీ విద్యార్థి హా జరు నమోదు చేయాలని ఆదేశించారు. ఇందులో ఎంఈవో సోమయ్య పాల్గొన్నారు.
Published date : 20 Nov 2024 03:15PM