Skip to main content

Andhra Pradesh: కొలువు.. చాలా సులువు.. CIPETలో లభిస్తున్న కోర్సులు ఇవే..

గన్నవరం రూరల్‌: ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ రంగంలో విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ అందిస్తోంది మండలంలోని సూరంపల్లిలో ఉన్న సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సీపెట్‌) సంస్థ.
Future Leaders in Plastics Engineering at SEPET, Gannavaram  These are the courses available in  Gannavaram Rural Education Hub

 2015 నుంచి గడిచిన ఎనిమిదేళ్లలో 700 మంది విద్యార్థులు ఈ విద్యను అభ్యసించారు. అంతేగాక ఇదే సంస్థలో నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తూ 3,300 మందికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు కల్పించిన ఘనత సీపెట్‌కు ఉంది.

సీపెట్‌లో లభిస్తున్న కోర్సులు..

పదో తరగతి విద్యార్హతతో 3సంవత్సరాలు చదివే డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌(డీపీటీ), డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ(డీపీఎంటీ), బీఎస్సీ ఉత్తీర్ణులైన వారికి రెండు సంవత్సరాల వ్యవధి గల పోస్టు గ్రాడ్యుయేట్స్‌ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌(పీజీడీ పీపీటీ) కోర్సును అందిస్తోంది.

చదవండి: Andhra University: రిటైరైన సైనికులకు ఉపాధి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సదుపాయం..

ఆయా కోర్సులకు ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తోంది. వీటిలో చేరడానికి అఖిల భారత స్థాయిలో ఏటా నోటిఫికేషన్‌ను ఏప్రిల్‌ నెలలో విడుదల చేస్తారు. సీపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ జూలైలో జరుగుతుంది. దీనిలో వచ్చిన ర్యాంకు ఆధారంగా సీపెట్‌లో 150 సీట్లు భర్తీ చేశారు. దీనిలో చదువుకున్న వారికి ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయి.

నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు..

10వ తరగతి విద్యార్హత, 18నుంచి 45 సంవత్సరాలు వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్‌ యువతకు జాతీయ సంస్థలు సౌజన్యంతో, సీఎస్‌ఆర్‌ కార్యాచరణలతో మూడు నెలల నుంచి 6నెలలు ఉచిత భోజన వసతి కల్పిస్తూ ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ కోర్సులలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నారు. వీరికి ప్రారంభ వేతనం రూ. 13వేల నుంచి రూ.18వేల వరకూ వచ్చే ఉద్యోగాలను సీపెట్‌ అందిస్తోంది.

‘సీపెట్‌’ విద్యతో మెరుగైన ఉద్యోగావకాశాలు

విద్యార్థుల నైపుణ్యం పెంపునకు పెద్ద పీట పదో తరగతి విద్యార్హతతో ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌లో కోర్సులు డిప్లొమాతో పాటు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమాకు అవకాశం

సీపెట్‌ లక్ష్యం ఇదే..
ఇండస్ట్రీ వాతావరణంలో స్కిల్స్‌, లైవ్‌ ప్రాక్టికల్స్‌ను నిర్వహిస్తున్నాం. క్యాంపస్‌లోనే వసతి, భోజనం ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా, నైపుణ్యాభివృద్ధి కోర్సులు చదివిన వారు ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. అంతేగాక సొంతంగా ఇండస్ట్రీలను స్థాపిస్తూ పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. సీపెట్‌ కోర్సులలో చేరాలనుకునే ఆసక్తి ఉన్నవారు 9440531978, 7893586494 నంబర్‌లను సంప్రదించండి.
– డాక్టర్‌ సీహెచ్‌ శేఖర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌, సీపెట్‌

 

sakshi education whatsapp channel image link

Published date : 15 Dec 2023 03:29PM

Photo Stories