Artificial Intelligence Impact: రానున్న రోజుల్లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. తాజా నివేదికలో షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: రాబోయే రోజుల్లో తమ ఉద్యోగాలు, తదుపరి అవకాశాలపై కృత్రిమ మేథ (ఏఐ) చూపే ప్రభావంపై భారతీయులు అంతగా ఆందోళన చెందడం లేదు. తాము ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలపై ఏఐ, జనరేటివ్ ఏఐ పెద్దగా ప్రభావం చూపవని 54 శాతం మంది భారతీయ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
ఇతర దేశా ల్లో మాత్రం ఈ తరహా ధీమా కాస్త తక్కువగా ఉండటం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 42శాతం మంది మాత్రమే తమ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం అంతగా ఉండదని భావిస్తున్నారు. వాస్త వానికి ఏఐ ప్రభావంపై ఆందోళన అనేది ప్రపంచ వ్యాప్తంగా ఐదు శాతం పెరిగినట్టు ఓ తాజా నివేదిక స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లోని వివిధ ప్రాంతాల్లో 13 వేల మందికి పైగా ఉద్యోగుల నుంచి సదరు సంస్థలు అభిప్రా యాలు సేకరించింది. తమ అధ్యయనం ఆధారంగా ఒక రిపోర్ట్‌ను రూపొందించింది.
భారీ మార్పులు ఖాయం
తమ ఉద్యోగాల్లో ఏఐ, జనరేటివ్ ఏఐ రెండూ తమ ఉద్యోగాల్లో భారీ మార్పులకు తెరలేపుతా యని 88 శాతం మంది భారతీయులు అభిప్రా యపడ్డారు. ఈ కారణంగా వచ్చే పదేళ్లలో తాము చేస్తున్న ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం ఉందని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా విభిన్న రంగాలకు చెందిన 43 శాతం ఫ్రంట్‌లైన్ ఉద్యోగులు ఇప్పటికే రెగ్యులర్‌గా ఏఐ ఇతర టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు.