Collector Tejas Nandlal Pawar: లెక్చరర్‌గా మారిన కలెక్టర్
జూలై 12న ఆయన గరిడేపల్లి ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలు, పీహెచ్‌సీ, గడ్డిపల్లి ఆదర్శ పాఠశాల, ఇటీవల సీజ్ అయిన ఒక రైస్‌మిల్లును తనిఖీ చేశారు. అలాగే పెన్‌పహాడ్ మండలం సింగారెడ్డిపాలెం ప్రాథమిక, జెడ్పీ ఉన్నత పాఠశాలలు, పీహెచ్‌సీ, తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాలు, పాఠశాలలు, పీహెచ్‌సీలలో హాజరు రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు.
అనంతరం గరిడేపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గరిడేపల్లిలో ప్రజా పాలన దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. పలు విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
అర్హులైన వారు సంక్షేమ పథకాలు అందకుంటే ఈ కౌంటర్‌లో మరలా దరఖాస్తు చేసుకుంటే తప్పులను సరిచేస్తారన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేయాలన్నారు. పాఠశాలల్లో తరగతి గదులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అలాగే సిబ్బంది, ఉపాధ్యాయులు సమయపాలన తప్పక పాటించాలని సూచించారు.
పదో తరగతి విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించేలా చూడాలన్నారు. గ్రామాల్లో సీజనల్ జ్వరాలు, ఇతర అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం పెన్‌పహాడ్ పీహెచ్‌సీ ఆవరణంలో మొక్క నాటారు. గరిడేపల్లి ఆరోగ్య కేంద్రంలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడంపై ఒకసారి పరిశీలించి నివేదిక అందించాలని డీఎంహెచ్‌ఓకి ఫోన్ చేసి ఆదేశించారు.
కార్యక్రమాల్లో గరిడేపల్లి, పెన్‌పహాడ్ తహసీల్దార్లు కవిత, మహేందర్‌రెడ్డి, పెన్‌పహాడ్ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, గరిడేపల్లి ఇన్‌చార్జి ఎంపీడీఓ సోమసుందర్‌రెడ్డి, ఎంఈఓలు చత్రునాయక్, నకిరేకంటి రవి, వైద్యాధికారి స్రవంతి, గడ్డిపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వీరబాబు, లెక్చరర్ రవీంద్రనాయక్, అధికారులు పాల్గొన్నారు.
మండలాల్లో పర్యటన.. లెక్చరర్‌గా మారిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కొద్దిసేపు అధ్యాపకుడిగా మారి ఇంటర్ విద్యార్థులకు పాఠం చెప్పారు. జూలై 12న గరిడేపల్లి మండలం గడ్డిపల్లి మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలను కలెక్టర్ తనిఖీ చేసిన సందర్భంగా ఇంటర్ ఫస్టియర్ బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్‌లోని ఫార్ములాల గురించి స్వయంగా 35 నిమిషాల పాటు బోధించారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
ఫార్ములాలు, వేగము, తోరణము అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి ఎలా గుర్తు పెట్టుకోవాలో వివరించారు. అనంతరం కళాశాలలో సమస్యలు, బోధన విధానం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
Tags
- Lecturer
- district collector
- Tejas Nandlal Pawar IAS
- Collector Teaching in Inter College
- Telangana News
- Suryapet District News
- CollectorTejasNandlalPawar
- Penpahad
- Garidepally
- MPDOoffice
- TehsildarOffice
- PHCinspection
- GaddipallyAdarshSchool
- SeizedRiceMill
- GovernmentInspection
- sakshieducationlatest news