Katroth Sumalatha: ఎంబీబీఎస్ సీటొచ్చినా కూలి పనులకు..
ఇప్పుడా దంపతుల రెండో కుమార్తెకు ఎంబీబీఎస్ సీటొచ్చినా.. డబ్బుల్లేక కూలి పనులకు వెళ్తోంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్‌పూర్ భద్యతండాకు చెందిన కాట్రోత్ శివరాం, గంసీలకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్న ఎకరం భూమి సాగు చేస్తూ, వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
చదవండి: Lavudya Devi: డాక్టర్ చదువుకు డబ్బుల్లేక.. కూలి పనులకు.. సీటొచ్చినా.. ఫీజు కట్టలేని అడవి బిడ్డ
పెద్ద కొడుకు విజయ్‌కుమార్ కాకినాడలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం.. పెద్దకూతురు అనిత సిరిసిల్ల ప్రభుత్వ కళాశాలలో నర్సింగ్ చదువుతున్నారు. చిన్న కొడుకు రాహుల్ ఖమ్మం ఎస్టీ గురుకుల కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
చదవండి: Lavudya Devi: ‘సాక్షి’ కథనానికి స్పందించిన మంత్రి.. పేద విద్యార్థిని కాలేజీ ఫీజుకు భరోసా
రెండో కూతురు కాట్రోత్ సుమలత సిద్దిపేటలోని సురభి ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. కానీ ప్రైవేట్ కళాశాల కావడంతో ఏటా సుమారు రూ 3 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో ఉన్న పొలం తాకట్టుపెట్టి రూ.లక్షన్నర చెల్లించింది. ఇంకా హాస్టల్ ఇతరత్రా ఖర్చులకు రూ.లక్షన్నర అవసరం కావడంతో ఏం చేయాలో తెలియక సుమలత ఆవేదన చెందుతోంది. పెద్ద మనుసున్న దాతలు 77801 06423 ఫోన్ నంబర్‌కు తోచిన సాయం చేయాలని కోరుతోంది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |