Skip to main content

Nursing Jobs: నర్సులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు.. అభ్యర్థుల అర్హత‌లు ఇవే..

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన నర్సులకు జర్మనీలో ఉద్యోగ అవకా­శాలు కల్పించడంకోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ సంయుక్తంగా ఎస్‌ఎమ్‌ కేర్, హాలో లాంగ్వేజ్‌ సంస్థలతో అక్టోబర్ 29న ఎంవో­యూ కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలోని ఆసక్తి కలిగిన నర్సింగ్‌ అభ్యర్థులకు ఉచితంగా జర్మన్‌ భాషలో శిక్షణ ఇవ్వనున్నట్టు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ గణేష్‌ వివరించారు.
Job Opportunities for Nurses in Germany news in telugu  AP Skill Development Corporation and AP Overseas Manpower Company sign MoU  Job opportunities for Andhra Pradesh nurses in Germany

ఆరు నెలల్లో ఏ1, ఏ 2, బీ1, బీ2 దశల్లో శిక్షణ ఇచ్చి, బీ2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేసి జర్మనీలోని ఆస్పత్రుల్లో ఎస్‌ఎం కేర్‌ సంస్థ ద్వారా నియమిస్తామన్నారు.

చదవండి: Supreme Court Help for Student: విద్యార్థికి సాయపడేందుకు ముందుకొచ్చిన సుప్రీంకోర్టు

ఎంపికైన అభ్యర్థులకు విమాన టికెట్లు, వీసా, డాక్యుమెంట్‌ ట్రాన్స్‌లేషన్‌ వంటి సదుపాయాలు ఉచితంగా కల్పిస్తారన్నారు. బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎంతో పాటు రెండు సంవత్సరాల కనీస అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులని వివరించారు.

Published date : 30 Oct 2024 05:13PM

Photo Stories