ఉన్నత విద్యలో T–SAT తోడ్పాటు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో నాణ్యత పెంచేందుకు టీ–శాట్ సేవలను వినియోగించుకోవాలని ఉన్నత విద్యా మండలి భావించింది.
డిజిటల్ బోధన ప్రణాళికలో అత్యున్నత సాంకేతికతను టీ–శాట్ ద్వారా అందుకోవాలని నిర్ణయించింది. విశ్వవిద్యా లయాలు, సాంకేతిక విద్యా సంస్థల్లో నిపుణులైన ఫ్యాకల్టీ గుర్తింపులోనూ ఆ సంస్థ తోడ్పాడు తీసుకునే దిశగా అవగాహన ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమైంది. టీ–శాట్ కార్యాలయాన్ని అక్టోబర్ 28న ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ సందర్శించారు. టీ–శాట్ సీఈవో బి.వేణుగోపాల్ రెడ్డితో ఎంవోయూపై చర్చించారు.
చదవండి: Lavudya Devi: డాక్టర్ చదువుకు డబ్బుల్లేక.. కూలి పనులకు.. సీటొచ్చినా.. ఫీజు కట్టలేని అడవి బిడ్డ
Published date : 29 Oct 2024 05:14PM