Skip to main content

School Holidays Extended Till 2024 June 30 : విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. స్కూల్స్‌కు జూన్ 30వ తేదీ వ‌ర‌కు సెల‌వులు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : చాలా రాష్ట్రాల్లో ఇంకా ఎంత తీవ్ర‌త త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల్లో వేస‌వి సెల‌వులు ముగియ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో వివిధ రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.
end of summervacations  School Holidays Extended Till 2024 June 30  Announcement of key decisions by state governments

పిల్ల‌ల ఆరోగ్యం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోని స్కూల్స్‌కు వేస‌వి సెల‌వులను పొడిగించారు. తాజాగా Chhattisgarh, Uttar Pradesh, Bihar, Rajasthan, Delhi, Punjab and Haryana రాష్ట్రాల ప్ర‌భుత్వాలు స్కూల్స్‌కు వేస‌వి సెల‌వుల‌ను పొడిగించారు.  ఈ మేర‌కు అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు  ఉత్తర్వులు జారీ చేశారు.

☛ July 27, 28th Holidays : జూలై 27వ తేదీన‌ సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. కార‌ణం ఇదే..

ఛత్తీస్‌గడ్‌లో..
ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలకు వర్తిస్తుంద‌న్నారు. వాస్తవానికి  ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 22 నుంచి జూన్ 15 వరకు అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. అయితే ఎంత తీవ్ర‌త కార‌ణంగా ఈ వేస‌వి సెల‌వుల‌ను పొడిగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వేసవి సెలవులను  జూన్ 25 వరకు పొడిగించింది. జూన్ 26 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, దానితో పాటు వడగాలు సైతం విపరీతంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

☛ Good News For Government Teachers 2024 : టీచ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌.. 10000 మందికి పైగా పదోన్నత‌లు.. వీరికి మాత్ర‌మే..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో.. 
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కూడా ప్ర‌స్తుతం వేస‌వి తీవ్ర‌త చాలా ఎక్కువ‌గా ఉంది. దీంతో పిల్ల‌ల ఆరోగ్యం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోని.. UP Director of Basic Education Council Pratap Singh Baghel స్కూల్స్‌కు వేస‌వి సెల‌వుల‌ను జూన్ 29వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. తిరిగి ఈ స్కూల్స్ జూన్ 30వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి.

న్యూఢిల్లీలో..
న్యూఢిల్లీలో స్కూల్స్‌కు వేస‌వి సెల‌వుల‌ను జూన్ 30వ తేదీ వ‌ర‌కు పొడిగించారు.

 TS Government Job Calendar 2024 Release : తెలంగాణ‌లో జాబ్ క్యాలెండర్-2024 విడుద‌ల.. ఎప్పుడంటే..? పోస్టుల వివ‌రాలు ఇవే..

పంజాబ్ & హ‌ర్యానాలో..
పంజాబ్  హ‌ర్యానా రాష్ట్రాల్లో.. పాఠ‌శాల‌ల‌కు వేస‌వి సెల‌వుల‌ను జూన్ 30వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. తిరిగి ఈ స్కూల్స్ జూలై 1వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి.

బీహార్‌లో..
బీహార్ రాష్ట్రంలో.. స్కూల్స్‌కు వేస‌వి సెల‌వుల‌ను జూన్ 19వ‌తేదీ వ‌ర‌కు పొడిగించారు. తిరిగి ఈ స్కూల్స్ జూన్ 20 తేదీన పునఃప్రారంభం కానున్నాయి.

 Teacher Jobs in Telangana (DSC 2024): 11,062 టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ వివరాలు.. ఎంపిక విధానం, రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్‌..

 

2024లో Schools & Colleges సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

Published date : 19 Jun 2024 08:27AM

Photo Stories