Skip to main content

Good News For Government Teachers 2024 : టీచ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌.. 10000 మందికి పైగా పదోన్నత‌లు.. వీరికి మాత్ర‌మే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న‌ ప్ర‌భుత్వ టీచ‌ర్ల‌కు ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్ప‌నున్న‌ది. తెలంగాణ పరిధిలోని 19 జిల్లాల్లో దాదాపు 10 వేల మంది ఉపాధ్యాయులు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు.
Telangana Government Teachers Promotions 2024. Telengana government announcement for promotions

ఇందుకు సంబంధించి ఉత్తర్వులు ఏ క్షణమైనా విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఆ వెంటనే వారికి కేటాయించిన కొత్త స్థానాల్లో చేరనున్నారు.

అలాగే వీరికి కూడా పదోన్నత‌లు..
భాషా పండితులు, పీఈటీలతోపాటు సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్‌జీటీ) కూడా ఆయా సబ్జెక్టు నిపుణులుగా పదోన్నతి పొందనున్నారు. ఉద్యోగోన్నతి పొందే మొత్తం టీచర్లలో 5,800 మందికిపైగా భాషా పండితులు, పీఈటీలే ఉన్నారు. రాష్ట్రంలోని భాషా పండితులు, పీఈటీల 15 ఏళ్ల కల ఫలిస్తూ.. స్కూల్‌ అసిస్టెంట్లుగా ఎట్టకేలకు పదోన్నతి పొందనున్నారు. 

TS Government Job Calendar 2024 Release : తెలంగాణ‌లో జాబ్ క్యాలెండర్-2024 విడుద‌ల.. ఎప్పుడంటే..? పోస్టుల వివ‌రాలు ఇవే..

మల్టీ జోన్‌-1, 2లో..
మల్టీ జోన్‌-1లోని 19 జిల్లాల్లో సుమారు 4,900 మంది భాషా పండితులు, 900 మంది పీఈటీలు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్‌లో 454 మంది భాషా పండితులు, ఖమ్మం జిల్లాలో 107 మంది పీఈటీలు పదోన్నతి అందుకోనున్నారు. 

వీరికి రెండు ఇంక్రిమెంట్లు..
దీంతో భాషా పండితులు, స్కూల్‌ అసిస్టెంట్‌ భాషా ఉపాధ్యాయులు, పీఈటీలు.. స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ డైరెక్టర్లు అవుతారు. వారిలో నాలుగో వంతు మందికి రెండు ఇంక్రిమెంట్లు దక్కనున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మల్టీ జోన్‌-2లోని 14 జిల్లాల్లో కూడా పదోన్నతులు లభించనున్నాయి.

 Teacher Jobs in Telangana (DSC 2024): 11,062 టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ వివరాలు.. ఎంపిక విధానం, రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్‌..

Published date : 18 Jun 2024 06:19PM

Photo Stories