Skip to main content

Revenue Department 10954 jobs: రెవెన్యూ శాఖలో 10,000కీ పైగా ఉద్యోగాలు?

Revenue department jobs
Revenue department jobs

రాష్ట్రంలో గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఈ దిశగా కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)కు దీనిపై అధ్యయనం చేయమని గతంలోనే ప్రభుత్వం సూచించింది.

Work From Home jobs రోజు 3నుంచి 4గంటలు పని చేస్తే చాలు: Click Here

గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీసీఎల్‌ఏ అందించిన నివేదికలోని ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు రావడంతో ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. దీనిపై మరింత అధ్యయనం చేయాలని సీసీఎల్‌ఏను ప్రభుత్వం మరోసారి కోరింది.

“జేఆర్‌వో” (జూనియర్ రెవెన్యూ ఆఫీసర్) లేదా “గ్రామ రెవెన్యూ కార్యదర్శి”

రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ సీసీఎల్‌ఏకు లేఖ రాశారు. తొలుత అందించిన నివేదిక ప్రకారం, గతంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వీఆర్‌వో (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్), ప్రతి ఆవాసానికి ఒక వీఆర్‌ఏ (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్) ఉండేవారు. మొత్తం 25,750 మంది పనిచేసేవారని, వీరిలో 5,195 మంది వీఆర్‌వోలుగా ఉండగా, ఎక్కువ మంది డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగినవారని పేర్కొంది. కొత్తగా నియమించబోయే సిబ్బందికి “జేఆర్‌వో” (జూనియర్ రెవెన్యూ ఆఫీసర్) లేదా “గ్రామ రెవెన్యూ కార్యదర్శి” అని పేర్లు పెట్టాలని ప్రతిపాదించింది.

10,954 గ్రామాలకు సిబ్బంది

రెవెన్యూ గ్రామాలకు సిబ్బందిని నియమించడానికి అర్హతలు, ఎంపిక విధానం, వేతనాలు వంటి అంశాలపై సీసీఎల్‌ఏ రెండో నివేదిక కీలకంగా మారనుంది. ప్రస్తుతం సుమారు 10,954 గ్రామాలకు సిబ్బందిని నియమించాల్సిన నేపథ్యంలో, గతంలో తొలగించిన వీఆర్‌వోలు, వీఆర్‌ఏల్లో 5వేల మందిని తిరిగి తీసుకోవాలని, మరో 5 వేల మందిని కొత్తగా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.

తిరిగి ఎంపిక

గతంలో పని చేసినవారిలో తగిన అర్హతలు ఉన్నవారిని తిరిగి ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీసీఎల్‌ఏ ఇచ్చిన మొదటి నివేదిక ప్రకారం, గ్రామస్థాయిలో పనిచేసే సిబ్బందికి పలు విధులను అప్పగించాలనుకుంటున్నారు, అందులో ప్రభుత్వ భూముల సంరక్షణ, చెరువులు, భూవివాదాల పరిష్కారం, సర్వే పనులు, వితంతు సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎన్నికల విధులు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో సహకారం ఇవ్వడం వంటి బాధ్యతలు ఉన్నాయి.

Published date : 22 Oct 2024 01:16PM

Photo Stories